టీడీపీకి 38 సీట్లా…ఈ స‌ర్వే న‌మ్మొచ్చా..!

ప‌చ్చ‌ని టీడీపీలో ఇప్పుడు మంట‌లు రేగుతున్నాయి! నేత‌లు ఒక‌రి మొహం ఒక‌రు చూసుకుని బావురుమంటున్నారు. దీనికి కార‌ణం ఇటీవ‌ల వైసీపీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు, స‌హాయ‌కుడుగా నియ‌మితుడైన ప్ర‌శాంత్ కిషోర్‌.. తాజాగా 2019 ఎన్నిక‌ల గెలుపోట‌ముల‌పై, సీట్ల వాటాల‌పై లెక్క‌లు వేయించాడ‌ట‌. ఈ స‌ర్వేలో టీడీపీకి దిమ్మ‌తిరిగేలా రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని అంటున్నారు. రాబోయే రెండేళ్ల‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం 38 స్థానాల్లోనే గెలుస్తుంద‌ని ఈ స‌ర్వే చెప్పంది.

ఇంక మిగిలిన సీట్ల‌న్నీ.. జ‌గ‌న్ క్లీన్ స్వీప్ చేస్తాడ‌ని కూడా పేర్కొంది.

దీంతో వైసీపీలో హుషారు పెరిగిపోయి.. గెలుపుపై కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ ఊపందుకున్నాయ‌ట‌. ఈ క్ర‌మంలోనే చెవిరెడ్డి వంటి వారు మాట‌ల తూటాల‌తో ఉద్యోగుల‌పై రెచ్చిపోతున్నారు. ఇక‌, టీడీపీ ప‌రిస్థితి మాత్రం కుడితిలో ప‌డ్డ ఎలుక‌లా మారింద‌ని అంటున్నారు. రాబోయే ముప్పై ఏళ్లు అధికారంలో ఉండాల‌ని చంద్ర‌బాబు క‌లలు కంటున్నారు. అయితే, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త చాప కింద నీరులా పాకుతోంద‌ని, అది ఎన్నిక‌ల్లో పెద్ద దెబ్బ వేసేస్తుంద‌ని ఈ స‌ర్వేలో తేలింద‌ట‌.

అయితే, ఈ స‌ర్వేపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. నిజానికి జ‌గ‌న్‌కు 110 సీట్లు సొంతంగా సాధించే సీన్ ఉందా? అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మి, జ‌న‌సేన‌-వామ‌పక్షాలు, క‌లిసివ‌స్తే.. కాంగ్రెస్, ఇన్ని అన్ని వైపుల నుంచి పోటీప‌డుతుండ‌గా.. ఒక్క జ‌గ‌న్ మాత్ర‌మే ఇన్ని సీట్లు గెలుస్తాడ‌ని స‌ర్వేలో తేల‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలోకి నెట్టేసింది. ప్రశాంత్ స‌ర్వేలో ఏదో మాయ ఉంద‌ని అంటున్నారు కొంద‌రు! సో.. ఏదేమైనా.. టీడీపీకి కేవ‌లం 38 సీట్లేనా ? అంటే 2004 నాటి సీన్ రిపీట్ అవ్వాల్సిందే!! మ‌రి ఆ రేంజ్‌లో జ‌గ‌న్ పుంజుకుంటున్నాడా? ఏమో చూడాలి!!