అధికారులకు చుక్కలు చూపిస్తున్న కేసీఆర్ ఐడియా

జూన్ 2 న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎగరవేసిన జాతీయజెండా అధికారులకు చిక్కులు తెచ్చిపెడుతోంది.దేశంలోనే అతిపెద్దదైన, ఎత్తైన జెండా నిర్వహణ చాలా కష్టంగా మారింది. అంత ఎత్తులో ఉండడం, చాలా పెద్ద జెండా కావడంతో గాలికి చిరిగిపోతోంది. అది జాతీయ జెండాకు అవమానం. దీంతో కొత్త జెండా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అలా ఇప్పటి వరకు ౩ జెండాలు మార్చారు. రెండు వారాల్లో ఇది మూడో జెండా. మళ్లీ కొత్త జెండా తీసుకొచ్చిన ఎగురవేయలేదు. గాలి ఎక్కువగా ఉండటంతో తరువాత ఎగురవేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం హెచ్ ఎండీఎ జెండా నిర్వహణ బాధ్యతను చూస్తోంది. జెండాకు అవమానం జరిగితే దేశానికి జరిగినట్టే లెక్క. అందుకే ఈరూల్స్ కచ్చితంగా పాటించాలి.లేకపోతే కేసు పెట్టి జైల్లో కూడా పెట్టొచ్చు.

ముఖ్యంగా చిన్న పాటి చిరుగుఉన్నా… సరే ఈ జెండా ఎగురవేయకూడదు. దీంతో సంజీవయ్యపార్కులో ఎప్పటికప్పుడు కొత్త జెండా పెట్టడం లేదా…చిరిగిన జెండా కనిపించకుండా మరమ్మత్తులు జరిగిపోవాలి. ఆఫీసర్లకు ఇప్పుడు ఇదే టెన్షన్… భారీ గాలులకు జెండా చిరిగిపోతున్నందున ఇప్పటికే రెండు జెండాలు స్పేర గా ఉంచారు. మొదటి పతాకాన్ని ఖమ్మనానికి చెందిన సంజీవరావు వ్యక్తి తయారు చేశాడు. అతడికే మరో రెండు జెండాల ఆర్డర్లు ఇచ్చారు. అంతే కాకుండి ముంబైలోని సారాభాయి ప్లాగ్ కంపెనీకి మరో మూడు జెండాలు ఆర్డర్లు ఇచ్చారు. ఒక్కో జెండాకు లక్షా 15 వేల రూపాయిల వరకు ఖర్చు అవుతోంది. తరచూ జెండా చిరిగిపోతూ ఉండడంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు.