కేసీర్ లోని ఉద్యమనేత నిద్రలేస్తున్నాడా!

ఎవరితోనైనా పెట్టుకోవాలంటే వారి వెనుక ఎవరున్నారో చూసి పెట్టుకోవాలి అనే నానుడి మనం వినే ఉంటాం. కేంద్రం పోయి పోయి కొరివితో తల గోక్కోవడానికి సిద్దపడుతోంది. అసలేదైనా చిన్న అంశం దొరికితేనే అవతలివాళ్ళని కబడ్డీ ఆడుకునే రకం కేసీర్ ది. కావాలంటే ఈ విషయం రోశయ్యనడగండి చెప్తారు. హైద్రాబాద్ స్పెషల్ జోన్ అన్న అంశాన్ని పట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక ఊపు ఊపేసారు ఆయన. ఒకటేమిటి తెలంగాణకి ఏ చిన్న విషయంలో అయినా అన్యాయం జరుగుతోందనిపిస్తే చాలు కేసీర్ లోని ఉద్యమ నేత నిద్ర లేస్తాడు.

సరిగ్గా అలాంటి పనే చేస్తోంది ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజన విషయం.హైకోర్టు విభజన కేంద్రం పరిధిలోని అంశం. కేంద్రం ఈ వ్యవహారం పై సాగదీత ధోరణి ప్రదర్శిస్తోంది.దీనివెనుక ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలమైన లాబీయింగ్ కూడా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఉమ్మడి హైకోర్టు పరిధిలో అందరితో చంద్రబాబుకి వున్న సాన్నిహిత్యం కారణంగానే పలు రకాల కేసుల్లో తన వాదన వినిపించే వీలు హైకోర్టు విభజనతో పోతుందనే చంద్రబాబు హైకోర్టు విభజనకి అడ్డుపుల్ల వేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.

తాజాగా న్యాయాధికారుల నిరసనని ఉమ్మడి హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఇప్పటికే మొత్తం 11 మందిని సస్పెండ్ చేసినట్టు సమాచారం.దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.తెలంగాణా వ్యాప్తంగా న్యాయమూర్తులు రోడ్డెక్కాడు,మొత్తం విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు.ఈ తతంగమంతా కేసీర్ లో ఉద్యమ నాయకుడ్ని నిద్రలేపింది.ఇంకేముంది ఢిల్లీ వేదికగా జంతరమంతర్ వద్ద కేసీర్ నిరసన చేపట్టే ఆలోచనలో వున్నారు.కేసీర్ నిరసన, దీక్షా ఏ రేంజ్ లో వుంటాయో ఒక సారి చరిత్ర తిరగేయండి.ప్రజాస్వామ్యం లో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ కేసీర్ తో మాత్రం కాదు.ఈ సత్యమెరిగి విభజన చట్టం ప్రకారం హైకోర్టు విభజన జరిపి న్యాయవాదుల సమస్యల్ని పరిష్కరిచారా సరే సరి లేకుంటే మీ ఖర్మ. కేంద్రాన్ని ఈ బీజేపీ పార్టీ ని ఇంకో 40-50 సంవత్సరాలు తెలంగాణా ప్రజలు మర్చిపోయేలా కేసీర్ చేయటం ఖాయం.