క్లైమాక్స్ కు వచ్చిన చైతూ సమంతా ల లవ్ స్టోరీ

సమంత, నాగచైతన్య ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తోంది. చాలా కాలంగా ఇంట్లో వారితో ఫైట్ చేస్తున్న నాగచైతన్య ఆల్ మోస్ట్ అందరిని ఒప్పించాడని చెబుతున్నారు . అయితే ఈ విషయంలో నాగార్జున పెద్దగా ఇంట్రెస్ట్ గా లేడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. కాని నాగచైతన్య మాత్రం ఈ వ్యవహారాన్ని వేరే రూట్లో తీసుకెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
నాగచైతన్య తాజా చిత్రాల కంటే ఆయన ప్రేమ వ్యవహారమే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాపిక్ ఆఫ్‌ ది టౌన్ గా నిలిచింది. చైతూ .. సమంతాతో ప్రేమలో పడ్డాడనే విషయం తెలిసినప్పటినుండి గాసిప్ రాయుళ్ళకు మంచి వార్త దొరికినట్టయింది.

ఇక వీరి ప్రేమ వ్యవహారంపై వారు కథలే అల్లేస్తున్నారు. తాజాగా మరో కొత్త కథ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. సమంత ప్రేమలో మునిగి తేలుతున్న చైతన్య తన పెళ్లికి మదర్ సపోర్ట్ తీసుకోవాలని అనుకున్నాడట. అంతేకాదు తన మదర్ ని చెన్నై పంపించి అక్కడ సమంతతో ఓ రోజు మొత్తం చెన్నైలో గడపమని చెప్పాడట. ఇక చెన్నై వెళ్ళిన నాగ చైతన్య మదర్ సమంత గుణగణాల గురించి తెలుసుకుని వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. కాకపోతే ఈ విషయంలో నాగ్‌ కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య ఈ విషయం మీద నాగార్జునతో సీరియస్ డిస్కషన్ చేయనున్నాడట. మరి ఆ తర్వాత అయిన నాగచైతన్య, సమంతల ప్రేమకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.