చైనా స్టీల్ అమరావతికి వచ్చేస్తోంది!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ ముందుకొచ్చింది. చైనా ప్రభుత్వరంగంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ అన్‌స్టీల్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనారు. ఆన్‌స్టీల్‌ కంపెనీతో జరిగిన సమావేశంలో నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి ఉక్కు అవసరం ఎంతగానో ఉంటుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సమయమని అన్నారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ జువెన్‌ గేంగ్‌ సానుకూలంగా స్పందించారు.

భారతదేశంలో పబ్లిక్, ప్రైవేటు కంపెనీలతో ఉక్కు కర్మాగారాల స్థాపనపై భాగస్వాములు కావడానికి అవకాశాలను పరిశీలించాలని సిఎం కోరారు. అమరావతి నగరాన్ని నవ్య పంథాలో నిర్మించనున్నామని, ఇందుకు ఉక్కు అవసరం చాలా ఉంటుందని అన్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి పరిస్థితులను సమీక్షించేందుకు ఒక బృందాన్ని ఎంపికి పంపించాలని చంద్రబాబు అన్ స్టీల్ కంపెనీని ఆహ్వానించారు. ఎపిలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని, పారిశ్రామిక అశాంతి లేదని చెప్పారు. కడపలో గతంలో బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన స్థలంలో ఉక్కు కర్మాగారం ఉన్న అవకాశాలను పరిశీలించమని అన్ స్టీల్ కంపెనీ ప్రతినిధులను కోరారు. కృష్ణపట్నం పోర్టుకు ఈ స్థలం దగ్గరలో ఉంటుందని, ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. హాంగ్జు డింగ్షెన్‌ ఇండిస్టీ గ్రూపు చైర్మన్‌ జోగ్జిన్హారుతో జరిపిన భేటీలో గనులు, చంద్రబాబు సమావేశమ య్యారు.. సంప్రదాయ, నవీన పద్ధతుల కలయికతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఇందులో భాగస్వామి కావాలని కువైట్‌ డానిష్‌ డెయిరీ సిఇఒను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి కువైట్‌ డానిష్‌ డెయిరీ ఆసక్తి కనపరిచింది.