దావూద్ ఏడ్చిన వేల!!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషాదంలో మునిగిపోయాడు. జాలి, దయ, కరుణ లాంటివేమి లేని దావూద్ లాంటి డాన్ కూడా ఏడుస్తాడా.. అతనికీ విషాద ఘటనలుంటాయా అని అశ్చర్యపోకండి. ఎన్ని మర్డర్లు చేసినా దావూద్ కు కుటుంబ సభ్యులంటే చచ్చేంత ఇష్టం. అందుకు చాలా మందిని తనతోపాటే పాకిస్తాన్ తీసుకెళ్లిపోయాడు.

దావూద్ కు ఎంతో ఇష్టమైన అతని చిన్న తమ్ముడు హుమాయున్ కస్కర్ చనిపోయాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న కస్కర్ ఇటీవలే మరణించడంతో దావూద్ ఇంట విషాదం నెలకొంది. ముంబైలో దావూద్ సృష్టించిన మారణహోమం తర్వాత సైలెంట్ గా పాకిస్తాన్ పారిపోయిన దావూద్.. కరాచీలో లెటిల్ అయ్యాడు. అక్కడ అతడు ఐఎస్ఐ రక్షణలో బిందాస్ జీవితాన్ని గడుపుతున్నాడు. ముంబై పేలుళ్లతో సంబంధం లేకపోయినా.. హుమాయున్ కూడా దావుద్ వద్దకి చేరి అక్కడే ఉంటున్నాడు. క్యాన్సర్ వ్యాధి సోకిన అతన్ని బతికించేందుకు డాక్టర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కళ్ల ఎదుటే తమ్ముడు చనిపోయే సరికి దావూద్ బాగా కుంగిపోయాడట.

ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న దావూద్.. తమ్ముడి మరణంతో డల్ గా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. సో ఎంతటి డాన్ అయినా.. ఎంతమందిని బెదిరించి, భయపెట్టినా.. ఎదో ఒక రోజు కన్నీళ్లు రాల్చక తప్పదని దావూద్ ఎపిసోడ్ తో అర్ధమవుతోంది.