బాహుబలి అక్కడ వర్కౌట్ కాదు-రాజమౌళి

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ వ్యాప్తం చేసిన మూవీ బాహుబలి. విడుదలైన చోటల్లా బంపర్ హిట్ అవడమే కాకుండా రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం బాహుబలికి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా బాహుబలి గురించి డైరెక్టర్ రాజమౌళి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. బాహుబలికి సినిమాకు పలు అవార్డులు అందుకున్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బాహుబలి ముందు విషయాలు వెల్లడించారు.
బాహుబలి సినిమాను ఎందుకు నేరుగా హిందీలో తెరకెక్కించలేదన్న ప్రశ్నకు రాజమౌళి ఇలా స్పందించారు.  ‘బాహుబలి: ద బిగినింగ్ ప్రాజెక్టును స్టార్ట్ చేసినప్పుడు.. నా చేతిలో స్క్రిప్ట్ తోపాటు షెడ్యూల్ కూడా పక్కగా రెడీ అయి ఉంది. ఈ మూవీ కోసం రెండేళ్లు డేట్స్ ఇచ్చే హీరోలు కావాలని మాకు తెలుసు. రెండేళ్లపాటు ఎలాంటి కమిట్ మెంట్స్ లేకుండా బాలీవుడ్ లో ఎవరైనా  డేట్స్ ఇవ్వడం సాధ్యమేనా..? అందుకై బాలీవుడ్ నటులను పెట్టుకొని ఉంటే ఈ సినిమా వచ్చేదికాదు. అని స్పష్టం చేశారు రాజమౌళి.
సినిమా మార్కెటింగ్ పైనా రాజమౌళి పలు విషషయాలు వెల్లడించారు. ప్రతి సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయలేమని.. కుల, మత, జాతి, భాషలకు అతీతంగా అందిరికీ ఆర్ధమయ్యే ఎమోషన్స్ ఉన్న స్టోరీతో సినిమా తీస్తే ఇతర భాషల్లో కడా రిలీజ్ చేయోచ్చన్నారు. బాహుబలి – ది బిగినింగ్ పలు భాషల్లో విడుదలై రూ.600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.