స్వామి ‘రామాయణం’లో నిజమెంత?

సుబ్రహ్మణ్యస్వామి అంటే దేశ రాజకీయాల్లో సంచలనం. బిజెపి నాయకుడిగా, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన ఎందరో రాజకీయ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించిన ఘనుడు. జయలలితను జైలుకు పంపడమే కాకుండా, సోనియాగాంధీతోపాటు ఆమె తనయుడు రాహుల్‌గాంధీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టాడీయన. ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ రెండోసారి ఆ బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుపుల్ల వేసింది కూడా ఈ స్వామే. ఈయనగారికి రామయణం గురించి వివాదం సృష్టించాలనిపించినట్లుంది. రామాయణంలో రాముడు, రావణుడి కాళ్ళు నరికేశాడు, మళ్ళీ వాటిని రప్పించాడు. ఎందుకు? అంటూ నెటిజన్ల ముందు ఓ ప్రశ్న ఉంచాడు. యుద్ధంలో రావణుడ్ని రాముడు సంహరించాడు. అంతవరకు అందరికీ తెలుసు. ఒక్కో తలనీ నరికేస్తోంటే కొత్తగా తలలు పుట్టకొచ్చాయి. విభీషణుడు రావణుడ్ని హతమార్చే ఉపాయం చెప్పాకనే రాముడు, అతన్ని హతమార్చాడు. తల నరకడం వరకు తెలుసుగానీ ఈ కాళ్ళు నరకడం ఏంటో అర్థం కాక నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. పండితులెవరైనా స్వామికి సమాధానమిస్తారేమో చూడాలి. అసలంటూ సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నలో నిజాయితీ ఉందా? నిజం ఉందా? అని కూడా చర్చించుకుంటున్నారు నెటిజన్లు