స్వామీ ఇక చాలు:మోడీ

ఎట్టకేలకు ప్రధాని మోడీ సుబ్రహ్మణ్య స్వామివ్యాఖ్యలపై స్పందించాడు.ఇప్పటికే స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ కి చాలా నష్టం జరిగిన మాట వాస్తవం.మోడీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఝలక్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆర్బీఐ గవర్నర్ రాజన్, ఆర్థకశాఖ అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న స్వామిపై ఇక చాలు ఇప్పటికి చేసిన నిర్వాకం చాలు అన్నరీతిలో వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. దేశంలో వ్యవస్థే గొప్పదని దానికి మించినది మరొకటి లేదని.. ఎవరైనా తామే గొప్ప అని అనుంటే.. అది సరికాదని చెప్పారు. రఘురామ్ రాజన్ దేశభక్తుడని.. దేశాన్ని ప్రేమించే వ్యక్తిని కొనియాడారు.ఆయన దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు.

ఆర్బీఐ డైరెక్టర్ రఘురాం రాజన్, కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆర్థిక ‍వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్లపై స్వామి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పరోక్షంగా జైట్లీపైనా స్వామి విమర్శలు చేశారు. స్వామి వ్యాఖ్యలపై ఓ ఇంగ్లీష్ ఛానల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు మోడీ. దీంతో సుబ్రహ్మణ్య స్వామి కాస్త తగ్గే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా పొమ్మనకుండానే పొగబెట్టే రీతిలో రాజన్ ను కేంద్రం సాగనంపుతుందనే విమర్శలకు మోడీ చెక్ పెట్టే ప్రయత్నం చేశారంటున్నారు.