చిరు మెచ్చిన డాన్స్ సుందరి సంబరం

July 27, 2016 at 11:34 am

‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ భామ ఊర్వశి రౌతేలా కన్ను టాలీవుడ్ పడింది. ఇక్కడి సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నానంటోంది. రీసెంట్ గా సైమా అవార్డు ఫంక్షన్ లో జరిగిన.. ఓ విషయాన్ని తెగ గుర్తుచేసుకుంటోంది. ఆ సందర్భం జీవితాంతం గుర్తుంచుకోదగ్గ అంశమని చెప్తోంది.

డీటైల్స్‌లోకి వెళ్తే.. సైమా వేడుకల్లో ఈ సుందరి ఓ పాటకు డ్యాన్స్ చేసింది. మొదటి వరుసలో కూర్చున్న మెగాస్టార్ తెగ చప్పట్లు కొట్టారట. తన డ్యాన్స్‌కు చిరంజీవి చప్పట్లు కొట్టడమనేది వెరీ వెరీ స్పెషల్ అని మురిసిపోతోంది ఊర్వశి. ఇక చిరుతో యాక్ట్ చేయడం అనేది నా కల అంటూ మనసులో మాట చెప్పేసింది.

ఓ ఫ్యాషన్ షో కోసం హైద్రాబాద్ వచ్చిన ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటున్నట్లు చెప్పింది. ‘టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరు ఎంతో కష్టపడతారు ప్రొఫెషనల్ గా ఉంటారు. నాకు ఆఫర్ వస్తే కచ్చితంగా సినిమా చేస్తా’ అని అంటోందీ ఉత్తరాఖండ్‌ సొగసరి.

చిరు మెచ్చిన డాన్స్ సుందరి సంబరం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts