ఫ్యాన్స్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన NTR

July 19, 2016 at 9:42 am

అసలే జనతా గారేజ్ పోస్ట్ పోన్ న్యూస్ విని NTR అభిమానులంతా నిరుత్సాహపడ్డారు.ఆగస్ట్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమాని సెప్టెంబర్ 2కి వాయిదా వేయడంతో ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకి నిరాశ ఎదురైంది.అయితే చిత్ర యూనిట్ ఇచ్చిన వివరణతో కొంతవరకు అభిమానులు సర్దుకున్నారు.

అయితే ఇది మర్చిపోకముందే NTR ఫ్యాన్స్ కి ఇంకో షాక్ ఇచ్చాడు.గత కొద్దీ రోజులుగా జనతా గారేజ్ ఆడియో NTR కొడుకు అభయ్ రామ్ పుట్టినరోజైన జులై 22 న గ్రాండ్ గా రిలీస్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ ఆడియో వేడుకలోనే నందమూరి వారసుడు అభయ్ రామ్ పుట్టిన రోజు వేడుకలు కూడా నిర్వహింస్తున్నట్టు వార్తలు వినిపించాయి.మాములుగా హీరోల పుట్టిన రోజులు,వారి వారసుల పుట్టిన రోజులు అభిమానుల సమక్షంలో జరగడం కొత్తేమి కాదు.తాజాగా NTR ఈ ఆలోచననని విరమించుకున్నట్టు సమాచారం.

ఈ నెల 22న ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ పుట్టిన రోజు కావడంతో.. ఆ రోజున పలు కార్యక్రమాలు చేపట్టేందుకు జూనియర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. అయితే తాజాగా NTR మాత్రం అభయ్ రామ్ పుట్టిన రోజున ఎటువంటి కార్యక్రమాలు వద్దని అభిమానులకి చెప్పినట్టుగా తెలుస్తోంది.ఈమేరకు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అధికారికమైన మెసేజ్ ఒకటి ఫ్యాన్స్ కి చేరిందని తెలుస్తోంది.

అభయ్ రామ్ మొదటి పుట్టినరోజు లండన్ లో చేయగా కనీసం రెండో పొట్టినరోజైనా గ్రాండ్ గా చేయాలనుకున్న అభిమానులకి మరో సారి నిరాశే ఎదురైంది.అయితే ఎందుకు NTR కొడుకు పుట్టిన రోజు వేడుకలకి అభిమానుల్ని వద్దన్నాడో మాత్రం ఇంకా తెలియరాలేదు.ఏమో NTR మనసులో ఏముందో.ఎప్పుడు అభిమానుల యోగా క్షేమాలు ఆలోచించే NTR ఈ నిర్ణయం తీసుకున్నాడంటే దీని వెనుక పెద్ద కారణమే ఉంటుందని అభిమానులనుకుంటున్నారు.

ఫ్యాన్స్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన NTR
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts