అతనికోసం పట్టుబట్టిన బన్నీ!

విలక్షణ నటన అంటే.. ఇప్పుడు అందరికీ రావు రమేష్ గుర్తుకొస్తున్నారు. ‘కొత్త బంగారు లోకం’ నుంచి ఆయన చేసిన ప్రతీ సినిమాలోనూ వైవిధ్యం చూపారు. క్యారక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలి ‘అ ఆ’లో ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏ పాత్రనైనా తనదైన శైలిలో అలవోకగా పోషించేస్తున్న ఈ ప్రతిభాశాలికి మరో మంచి ఛాన్స్ వచ్చిట్లు తెలుస్తోంది.

హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న తన సినిమాలో రావు రమేష్ కు ఒక మంచి పాత్రను బన్నీ ఆఫర్ చేశారట. ఈ సినిమాలో విభిన్నమైన .. కీలకమైన పాత్ర ఒకటి వుండటంతో, రావు రమేష్ అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలడని బన్నీ నమ్ముతున్నాడట. అందుకే.. సదరు పాత్ర మీరే చేయాలంటూ స్టైలిష్ స్టార్ ఆయనకు చెప్పాటడ. బన్నీ ఆఫర్ అంగీకరిస్తే.. రావు రమేష్ ను మరో విభిన్న పాత్రలో చూడొచ్చు.