ఒంటరిగా ఏడ్చిన అనుష్క !

అందాల అనుష్కకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ నాయకిగా ఎదిగిన ఆమె ఈ స్థాయికి రావడానికి ఎంతే కష్టపడిందట. తాను పడ్డ శ్రమ, కృషిల గురించి స్వీటీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో అంతా గందరగోళంగా అనిపించి .. ఇంటికి వెళ్లి చదువుకోవాలని అనిపించేదని చెప్పింది.

వరుస షూటింగులతో అలసిపోయి .. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు వున్నాయని చెప్పింది. సెట్లో మాత్రం ఆ బాధను దాచేసి కనింపేదాన్నని తెలిపింది. హీరోల పక్కన ఆడిపాడే సినిమాల్లో కంటే కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేయడం మరింత కష్టమని చెప్పింది. చిత్రరంగంలోకి వచ్చిన కొత్తలో ఇంతగా బాధపడ్డ తాను .. సుదీర్ఘ కాలం కథానాయికగా కొనసాగుతుండటం విశేషమేనని చెప్పుకొచ్చింది అనుష్క.