కరీనాకు మొదటి సైఫ్ కి మూడో బిడ్డ!

బాలీవుడ్ అందాల నటి కరీనా కపూర్ తల్లికాబోతోంది. ఈ విషయాన్ని సైఫ్ అలీ ఖాన్ స్వయంగా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే తాము తల్లితండ్రులు కాబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. “ఈ శుభవార్త కోసం ఇంతకాలం వేచి ఉన్నవారందరికీ ధన్యవాదాలు” అంటూ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

వోగ్ పత్రిక జులై సంచికకు కరీనా ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చింది. కుటుంబంపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ “వివాహిత ఉద్యోగిగా ఉండాలన్నది నా ఆశ. నాకు భర్త ఉన్నాడు. అలాగే సంతానం కూడా ఉండాలని ఆశిస్తున్నాను. దేన్నీ వదులుకోలేను.” అని పేర్కొంది. ఈ మాటలతో కరీనా-సైఫ్‌లు త్వరలోనే అమ్మానాన్నలవుతున్నారని బాలీవుడ్‌ జనాలు చెప్పుకున్నారు. డిసెంబర్‌లో పుట్టబోయే బిడ్డ కరీనాకు తొలి సంతానం. సైఫ్‌కు మాత్రం మూడో సంతానం. మొదటిభార్య అమృతా సింగ్ ద్వారా సైఫ్‌కు ఒక అమ్మాయి-ఒక అబ్బాయి ఉన్నారు.