నా గూడు చెదిరింది:ఎరబ్రెల్లి

టిడిపిలో సీనియర్ నాయకుడిగా వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనా వ్యక్తిగా తెలంగాణ రాజకీయాలలో ఎర్రబెల్లి ద యాకర్‌రావుకు పేరుంది. కానీ ఆయన పసుపు కండువా మార్చి గులాబీ కం డువా వేసుకోవడంతో సీనంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకు సన్నిహితునిగా ముద్రపడ్డ దయాకర్‌రావు టిఆర్ఎస్ లో మాత్రం ఆ స్థాయి గుర్తింపు లభిం చడం లేదు. పార్టీ మారే సందర్బంలో తనకు కేబినెట్ మంత్రి హోదా గ్యారెంటీ అని తన అనుచరులకు చెప్పి పార్టీ మారిన దయన్నకు టిఆర్ఎస్‌లో గడ్డు పరిస్థి తులు ఎదురువుతూనే ఉన్నాయి.

తెలంగాణ టిడిపిని నిర్వీర్యం చేసే సందర్బం లో సిఎం కెసిఆర్ టిడిపికి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ, కిందిస్థాయి క్యాడర్‌కు కు కూడ పలు హమీలను ఇచ్చారు. దయాకర్‌రావు టిడిపిలో కొనసా గే సందర్బంలోను సిఎం కెసిఆర్‌తో సన్నిహిత సంబందాలనే నెరిపేవారని ప్రచారం జరిగింది. ఓ సందర్బంలో అర్దరాత్రి కెసిఆర్‌తో సమావేశమయి బయటకు వస్తూ మీడియాకు దొరికారు. ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేదని సిఎం కెసిఆర్ కుండబద్దలు కొట్టారు. ఒక వేళ ఉన్నా ఇప్పటికే సామాజిక సమీకరణాల లొల్లితో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎర్రబెల్లి సామాజిక వర్గాని కి చెందిన నలుగురు సిఎం కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారు. దీంతో ఎర్రబెల్లిని భర్తీ చేయడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. దీంతో ఎటూ పాలుపోని ఎర్రబెల్లి తనకు మంత్రి పదవి ఇచ్చేం దుకు సిఎం కెసిఆర్ రెఢీగా ఉన్నారని తానే పదవిని తీసుకోవడం లేదని తన అనుచరులవద్ద చెబుతున్నారని సమాచారం.

వరంగల్ జిల్లాకే చెందిన డిప్యూటి సిఎం కడియం శ్రీహరితో ఎర్రబెల్లి దయాకర్ రావు కు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉ న్నంత కాలం తాను క్యాబినేట్‌లో చేరే ప్రసక్తే లేదని ఆఫ్‌ద రికార్డులో ఎర్రబెల్లి చెబుతున్నారని సమాచారం. జిల్లా పార్టీలోను ఇద్దరి నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. బాహటంగా విమర్శలు చేసుకోనప్పటికి అంతర్గతంగా మాత్రం ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. దయాకర్‌రావు పార్టీ మారి నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడ జిల్లా పార్టీ కార్యాలయం లోకి రాకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులను పార్టీలోకి తీసుకువస్తానని మాట ఇచ్చిన దయాకర్‌రావు మాట తప్పడం వల్లే సిఎం కెసిఆర్ ఆయనకు ప్రాధాన్యత నివ్వడం లేదన్న ప్రచారం జరుగుతుంది.

టిడిపిలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంచి స్థానం ఉండేది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపికి ఎదురు గాలి వీచిన సందర్బంలో కూడ ఆయన గెలుపొందారని చంద్ర బాబు మంచి ప్రాధాన్యతనిచ్చేవారు. రాష్ట్ర విభజన సందర్బంలోను ఎర్రబెల్లి సూచనలకు విలువనిచ్చేవారు. తెలంగాణలో టిడిపి నమ్మిన వ్యక్తులలో ఆయన ఒకరు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నపుడు దయాకర్‌రావుకు మం త్రిగా పనిచేసే అవకాశం రాలేదు. విభజన అనంతరం టిఆర్ఎస్ దాడిని నిలువ రించలేక చేతులెత్తేసింది. ఈ పరిస్థితులలో పార్టీ మారిన దయాకర్‌రావు పునరాలోచనలో పడ్డారని సమాచారం. చంద్రబాబు వద్ద పనిచేసే రోజులలో తనకు మంచి ప్రాధాన్యత ఉండేదని టిఆర్ఎస్‌లోకి వచ్చాక తన పరిస్థితి ఆగమ్యగో చరంగా తయారైందని ఆయన వాపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అనవసరంగా తొందరపడ్డాననే భావన ఆయన మాటలలో వ్యక్తమవుతుండేది. ఇన్ని పరిణామాల మద్య ఎర్రబెల్లి తన రాజకీయ ప్రస్థానాన్ని టిఆర్ఎస్‌లో నెట్టుకురావడం కొంత ఇబ్బందికరమేనన్న విషయాలు వ్యక్తమవుతున్నాయి.