పవన్ కళ్యాణ్ పట్టుబట్టింది,చిరు కావాలంటోంది ఒక్కరే !

చిరంజీవి..మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 150 సినిమా కి సంబంధించి ప్రతి విషయం లోను చాలా కేర్ తీసుకుంటున్నారు.ప్రతి టెక్నిషన్ విషయం లోను ఎంతో ఆచి తూచి అడుగులేస్తున్నారు చిరు.ఇప్పటికే ఈ ప్రెస్టీజియస్ సినిమాకి పరుచూరి బ్రదర్ డైలాగ్స్ కసరత్తులు ప్రారంభించారు.అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలు రాయాల్సిందిగా మెగాస్టార్ బుర్రా సాయిమాధవ్ ని కోరినట్టు తెలుస్తోంది.

ఇంతకీ ఎవరీ బుర్రా సాయిమాధవ్ అనే కదా మీ సందేహం.`కృష్ణం వందే జగద్గురుమ్` చిత్రంతో డైలాగ్ రైటర్ గా సత్తా చాటారు బుర్రా సాయిమాధవ్.అంతే కాదు గోపాల గోపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ రచయితగా పేరు తెచ్చుకున్నారు కూడా.బుర్రా సాయిమాధవ్ గురించి ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పట్టుపట్టి `గోపాల గోపాల`కి సాయిమాధవ్‌తో డైలాగ్స్ రాయించుకున్నారు.అది సాయిమాధవ్ స్టామినా మరి.

కాగా చిరు ఏరికోరి మరీ సాయిమాధవ్ తో ఈ సినిమాలోని ముఖ్యమైన ఓ ఆరేడు సన్నివేశాల్ని రాయించాలని నిర్ణయించుకున్నాడు. టైటిల్ కార్డ్స్ లో పరుచూరి బ్రదర్స్ పేరు పడ్డా కూడా తెరవెనుక సాయిమాధవ్ కూడా తనవంతు,తనమార్క్ సన్నివేశాలు ఈ సినిమాలో మరో సారి చూడబోతున్నాం అన్నమాట.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టుబట్టిన రచయిత,మెగాస్టార్ చిరంజీవికి నచ్చిన రచయిత ఒకరే అంటే మాములు విషయం కాదు మరి.