పవన్ కొత్త సినిమా మళ్ళీ ట్విస్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీకి ఆరంభంలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. డైరెక్టర్ ఎస్.జే సూర్య తప్పుకోవడం., ఆ తర్వాత డాలీకి ఛాన్స్ ఇవ్వడం చక చకా జరిగిపోయాయి. కానీ షూటింగ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఐతే లేటెస్ట్ గా ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. పవన్ ఆ సినిమాని పక్కనబెట్టేశాడంటూ ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ కథతోనే ఆయన ముందుకెళ్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడిచింది.

కానీ వీటిలో అసలు నిజం లేదని తేలిపోయింది. నిర్మాత శరత్ మరార్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్ట్ ఆగిపోలేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఈ మూవీని కచ్చితంగా చేస్తారని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందన్నారు. ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్న పవన్ కల్యాణ్ తిరిగి హైదరాబాద్ వచ్చిన వెంటనే షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా కాస్టింగ్, టెక్నీషియన్స్ ఎంపికను పూర్తి చేయాలని డైరెక్టర్ డాలీకి చెప్పినట్లు సమాచారం.

పవన్.. త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడన్నది నిజమే కానీ.. డాలీతో సినిమా పూర్తైన తర్వాతే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని మెగా కాపౌండ్ న్యూస్.