పవన్ లక్ సుల్తాన్ కీ కలిసోస్తుందా?

కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సుల్తాన్‌’. ఈ సినిమాలో అనుష్కా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఎన్నో వివాదాలను దాటుకుని సినిమా రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడూ రంజాన్‌కి సల్మాన్‌ కొత్త సినిమాను రిలీజ్‌ చేయడం ఆనవాయితి. అలాగే సుల్తాన్‌ కూడా విడుదలయ్యింది. ఎప్పటిలానే సక్సెస్‌ టాక్‌ని తెచ్చి పెట్టింది. రంజాన్‌ సెంటిమెంట్‌ సల్మాన్‌కి ఎప్పుడూ రివర్స్‌ కాలేదు. పోజిటివ్‌ రెస్పాన్స్‌తో ‘సుల్తాన్‌’ రికార్డుల దిశగా దూసుకెళ్తోంది.

అయితే విడుదలకు ముందే ఈ సినిమా మొత్తం లీక్‌ అయిపోయిందట. దీని ప్రభావం సినిమా తొలిరోజు వసూళ్లపై పడింది. కానీ సినిమా పరంగా అంచనాలు భారీగా ఉన్నాయి. తర్వాతర్వాత ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుందంటున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌ నటనకు బాలీవుడ్‌లో ఖాన్స్‌ అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

టాలీవుడ్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ముందుగానే లీక్‌ అయిపోయింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలుకొట్టింది. లీకేజ్‌తో సంబంధం లేకుండా కాసుల మోత మోగించింది. అలాగే ఈ మంత్రం బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌కి వర్తిస్తుందేమో చూడాలి. సినిమాలో సల్మాన్‌ మల్లయోధుడిగా అద్భుతమైన నటన కనబరిచాడు. ‘సుల్తాన్‌’ ఓపెనింగ్స్‌ పరంగా రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో ‘సుల్తాన్‌’దే వసూళ్ళ పరంగా నెంబర్‌ వన్‌ పొజిషన్‌. వరుస సెలవులు రావడంతో ‘సుల్తాన్‌’కి తిరుగండకపోవచ్చని ట్రేడ్‌ నిపుణులు ఓ అంచనాకి వచ్చారు.