వాళ్ళెవరూ కాదు పవన్ నెక్స్ట్ ఆయనతోనే!

పవర్ స్టార్ సడన్ డెసిషన్స్…. చాలామంది డైరెక్టర్స్ ను ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాయి.ప్రెస్టీజియస్ గా తీసుకుని అతనితో సినిమాకు రెఢీ అయిన దర్శకులకు…పవన్ ఉన్నట్టుండి షాక్ లిస్తూ బయటకు పంపించేస్తున్నాడు. దీంతో టాలీవుడ్లో పవర్ సడన్ డెసిషన్స్ పై పెద్ద చర్చే నడుస్తుంది.

తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాన్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఒక దశలో చెప్పాలంటే మెగాస్టార్ ని ఎంతగా అభిమానించే వారో… పవన్ కళ్యాన్ ని కూడా అంతగా అభిమానిస్తున్నారు. దీంతో పవన్ పవర్ పీక్స్ లోకి వెళ్లిపోయింది.

ఇక ఈఏడాది పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎన్నో అంచనాలతో ఉగాది రోజున గబ్బర్ సింగ్ రిలీజ్ కాగా మొదటి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా కూడా బాగా దెబ్బతింది. దీంతో పవన్ తన తదుపరి చిత్రం విషయంలా చాలా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఖుషి, కొమరంపులి చిత్రాల తర్వాత దర్శకుడు ఎస్. జె.సూర్యతో మరో సినిమా తీయాలని ప్రపోజల్ రెడీ అయి ఓపెనింగ్ కూడా చేసుకుంది. ఐతే ఇపుడది క్యాన్సల్ కావడంతో…. ఇప్పుడు ఆ ప్లేస్ లో గోపాల గోపాల డైరెక్టర్ డాలితో పవన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. డాలితో సినిమా అని చెప్పారో లేదో అంతా ఓ రేంజ్లో ఎక్స్ పెక్ట్ చేస్తున్న టైమ్లో …డాలికి కూడా పవన్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది..ఎందుకంటే పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో కన్‌ఫాం అయిందని, అక్టోబరు నుంచి షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అంటే.. డాలీతో కూడా పవన్ మూవీ ప్రపోజల్ అటకెక్కినట్టేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎస్.జె.సూర్య .. పవన్ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా ఆ స్థానంలో డాలీ వచ్చాడు. ఇప్పుడు డాలీ కూడా ఔటా అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏమైనా డాలీ బదులు తమ అభిమాన హీరో పవన్.. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తే జల్సా, అత్తారింటికి దారేది తర్వాత మరో సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.