400 కోట్లు దేవుడెరుగు లాస్ లేదంతే!

భారీ ఫ్లాప్‌ తప్పదని ‘కబాలి’ గురించి ట్రేడ్‌ ఎక్స్‌పర్ట్స్‌ వేసిన అంచనాలు తల్లకిందులయ్యేలా ఉన్నాయి. ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లు, వారు అమలు పర్చిన వ్యూహాలతో సినిమా టాక్‌కి భిన్నంగా వసూళ్ళు వస్తున్నాయని సమాచారమ్‌.

మామూలుగా తొలి మూడు రోజులకు అడ్వాన్స్‌ బుకింగ్‌ అయిపోతూ ఉంటుంది. ‘కబాలి’ దగ్గరకొచ్చేసరికి వారం రోజుల పైనే చాలా చోట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌లు అయిపోయాయట. తద్వారా అందరూ రికవరీ అయిపోవచ్చని సమాచారమ్‌. ఇది కాకుండా ఫ్లాట్‌ రేట్స్‌తో ‘కబాలి’ టిక్కెట్లు అమ్మేయడం వల్ల నష్టాలు చెప్పుకుంటే తప్ప, నిజానికి నష్టాలు ఎవరికీ వచ్చే అవకాశం లేదని తెలియవస్తోంది.

‘కబాలి’ మేనియాని దృష్టిలో పెట్టుకుని, సినిమాని ఎలా అమ్మేయాలో అలా అమ్మేశాడు కలైపులి థాను. కబాలి స్టిక్కర్లు, కబాలి వెండి నాణేలు, కబాలి మర్చండైజ్‌ వంటివాటి ద్వారా కోట్లు వెనకేసుకున్నారట కొందరు. ఇవన్నీ లెక్కేసుకుంటే కళ్ళు బైర్లు కమ్మేయడం ఖాయమని తమిళ సినీ ట్రేడ్‌ పండితులు అంచనాలు కట్టేశారు. కబాలి 400 కోట్లు వసూలు చేసేసిందని ఇప్పటికే కలైపులి థాను చెప్పడం గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆయన ఇంతవరకు ఈ వార్తల్ని ధృవీకరించలేదు. ఏదేమైనా ‘కబాలి’ నిజంగా గట్టెక్కితే అది అద్భుతమే అవుతుంది.