NTR ఆల్ టైం రికార్డ్ అక్కడ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ టీజర్ రంజాన్ కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటలలోనే 2 మిలియన్ వ్యూస్ సాధించింది. ఎంతో స్పీడ్ గా ఇన్ని వ్యూస్ అందుకున్న చిత్రంగా జనతా గ్యారేజ్ టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. జనతా గ్యారేజ్ టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో చిత్ర టీం ఫుల్ హ్యపీగా ఉంది.

ఇదిలా ఉంటే మలయాళ టీజర్ విడుదలైన 24 గంటలలో 5 లక్షల వ్యూస్ సాధించింది. ఇది మలయాళంలో ఆల్ టైం రికార్డ్ అని చెబుతున్నారు. టీజర్ లో కొరటాల మార్క్ క్లియర్‌గా కనిపిస్తోండగా, దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ అని చెబుతున్నారు. ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉండగా, తాజాగా విడుదలైన టీజర్ ఆడియన్స్ లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. మరి స్మాల్ టీజర్‌ తోనే దుమ్ము రేపుతున్న ఎన్టీఆర్.. సినిమాతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.