సుశాంత్‌ బాగా వాడేశాడు

August 19, 2016 at 8:06 am

సుశాంత్‌ హీరోగా వస్తోన్న సినిమా ‘ఆటాడుకుందాం రా’. జి.నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చాలా స్పెషల్స్‌ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అఖిల్‌, చైతూల గెస్ట్‌ రోల్స్‌. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కరెక్ట్‌గా రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అఖిల్‌, సుశాంత్‌ ఉన్న ట్రైలర్‌ని విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌లో అఖిల్‌ చాలా రొమాంటిక్‌ లుక్‌లో అమ్మాయిల్ని బాగా ఎట్రాక్ట్‌ చేసేలా ఉన్నాడు. అంతేకాదు బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘సిసింద్రీ’ సినిమాలోని ‘చిన్ని తండ్రీ నిను చూడగా..’ సాంగ్‌ మ్యూజిక్‌తో మరీ ఎట్రాక్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే అదే సినిమాలోని ‘ఆటాడుకుందాం..రా అందగాడా’ అనే పాటకు అఖిల్‌, సుశాంత్‌ స్టెప్పులేశారన్న సంగతి తెలిసిందే. మరో పక్క అక్కినేని ఎవర్‌ గ్రీన్‌ మూవీ ‘దేవదాసు’లోని ‘పల్లెకు పోదాం పారును చూద్దాం’ పాట రీమిక్స్‌ కూడా ఉంది.

ఈ పాటలో తాత అక్కినేని నాగేశ్వరరావును కూడా బాగా వాడేశాడు సుశాంత్‌. సోనమ్‌ బాజ్వా హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. స్పెషల్‌ క్వాలిటీస్‌తో, సుశాంత్‌ క్లాస్‌ అండ్‌ న్యూ లుక్‌తో అదరగొడుతున్నాడు. నాగచైతన్య ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రలో కాస్సేపు మాత్రమే కనిపిస్తాడట. కథలో టర్నింగ్‌ పాయింట్‌ అదేనట. సినిమా విడుదలైన తర్వాత నాగార్జునతో మంచి ఈవెంట్‌ నిర్వహించి, సక్సెస్‌ మీట్‌గా దాన్ని మలచాలని సుశాంత్‌ అనుకుంటున్నాడని సమాచారమ్‌. ఏదేమైనా సుశాంత్‌, తన కొత్త సినిమా కోసం అక్కినేని హీరోలందర్నీ బాగా వాడేస్తున్నాడు.

సుశాంత్‌ బాగా వాడేశాడు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts