పవన్ బాబా ‘ప్రత్యేక’ పురాణం

ఎట్టకేలకు ప్రశ్నించే నాయకుడు స్పందించాడండోయ్..ప్రశించాడనేలేదు ఇక్కడ కేవలం స్పందించాడు.ఈయన స్పందించే నాయకుడో ప్రశ్నించే నాయకుడో అర్థం కావడం లేదు.ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది ఆయనే జనసేన అధ్యక్షుడు ప్రశ్నించడానికే పుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.

ప్రత్యేక హోదా అంశం పైన చాలా కూల్ గా చాలా రిలాక్స్డ్ గా స్పందించారు పవన్.ఒక పక్క పార్లమెంట్ లో బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వం మొర్రో అని గొంతు చించుకు అరుస్తుంటే..ఇంకోవైపు రాష్ట్ర ప్రజానీకం అంతా ఏకమై ప్రత్యేక హోదా కోసం నినదిస్తుంటే.ప్రతి పక్షం ఓ వైపు గొంతు చించుకుంటున్నా..ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తూ ప్రత్యేక హోదాని నీరు గారుస్తున్నా..కనీసం పవన్ కళ్యాణ్ అయినా ఇలాంటి టైం లో గట్టిగా కేంద్రాన్ని నిలదీస్తే ప్రయోజనం ఉంటుందని అందరు ఆశించారు.

అందరు ఆశించినట్టే పవన్ ప్రత్యేక హోదాపై స్పందించారు కానీ ప్రశించిన పాపాన పోలేదు.అదీ ఎంత విడ్డూరంగా స్పందిచారంటే అది వింటే ఈయనేనా జనసేన పార్టీ ఆవిర్భావ సభావో ఆవేశంతో ఊగిపోయింది..ఈయనేనా కాంగ్రెస్ వాళ్ళని గుడ్డలూడదీసి కొట్టాలి అని మీటింగుల్లో చాటింపు వేసింది అనిపిస్తుంది.ఎంచక్కా అస్త్ర సన్యాసం చేసిన స్వామీజీల చాలా కూల్ గా రిలాక్స్డ్ గా చూద్దాం..అంత తొందరేముంది అనే ధోరణిలో స్పందించడం ఆశ్చర్యమేస్తుంది.

అయినా నా ఒక్కడితో ఏమవుతుంది..చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులున్నారు,ప్రభుత్వం,ప్రతిపక్షం ఇన్ని ఉండగా నాతో ఇది అయ్యేదని నేను అనుకోను అని అచ్చం రాజకీయనాయకుడిలానే మాట్లాడాడు.అయినా ఇది అంతా తొందర పడాల్సిన విషయం కాదంట.చాలా జాగ్రత్తగా మాట్లాడాలంట..అయినా ఇంకా కేంద్ర ప్రత్యేక హోదా ఇవ్వను అని చెప్పలేదంట..ఒక వేళ అలా చెప్తే అప్పుడు పవన్ చూస్తారంట..బాబూ ఇంకా ఎలా చెప్పాలి కేంద్రం మాత్రం.

పాపం కేంద్రాన్నేమి అనకూడదు ఈ విషయం లో.వీలున్నప్పుడల్లా వేదిక దొరికినప్పుల్లా పాపం కేంద్రానికి తోచిన భాషలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వము..ఇవ్వలేము..సాధ్యం కాదు అని రకరకాలుగా చెప్తూనే వుంది.అయినా పాపం పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాలేదంటే.ఇక ఈయను డైరెక్ట్ గా మోడీగారు ఫోన్ చేసి చెప్పాలేమో మేము మీకు ప్రత్యేక హోదా ఇవ్వము అని.

ఇన్నాళ్లు ప్రత్యేక హోదా పైన పవన్ మాట్లాడాలి ప్రశ్నించాలి అని ఎదురుచూసిన ప్రతి ఒక్కరిదీ ఇప్పుడు ఒకటే ఆలోచన..అసలు పవన్ మాట్లాడుకున్నా బావుండేది..ఎప్పుడో ఒక సారి ప్రశ్నిస్తాడులే అన్న ఆశ అయినా ఉండేది.ఇప్పడు ఈ విషయం పై ఇంత చేతగాని వాడిలా ఈ స్పందన ఎవరికోసం..ఎవరి మెప్పుకోసం ఎవర్ని కాపాడడం కోసం.