రాంగోపాల్ వర్మ నయీమ్ ఇదిగో

తీసే సినిమాలకంటే చేసే విమర్శలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుండాడు వర్మ.సోషల్ మీడియా ఉందే వర్మ లాంటి వాళ్ళ కోసమేనేమో అనేంతగా వాడేస్తుంటాడు వర్మ.ట్విట్టర్ ఎప్పుడూ ఎవరో ఒకరిపై వైనాగాస్త్రాలు సంధిస్తూనే ఉంటాడు వర్మ.ఎక్కడైనా ఏదయినా సంచలనం జరిగితే చాలు వెంటనే దానిపై సినిమా ఎలా తీయాలా అని ఆలొచిస్తుంటాడు క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.

ఇప్పటికే ముంబై తాజ్ హోటల్ పై ఉగ్రదాడిని సినిమాగా తీసిన వర్మ ఆతరువాత రాయలసీమ ఫ్యాక్షన్ ఆధారంగా పరిటాల రవి ముద్దలచెరువు సూరి ల జీవిత గాధల ఆధారంగా రక్తచరిత్ర-1,2 తీసాడు.తరువాత గంధపుచెక్కల గజ దొంగ వీరప్పన్ సినిమానీ తెరకెక్కించాడు.తరువాత బెజవాడ రౌడీయిజమ్ ఆధారంగా వంగవీటి మోహన రంగ జీవిత గాధను సినిమాగా తీస్తున్నాడు.ఒక రకంగా వర్మ తీసే హారర్ సినిమాలకంటే ఈ రియల్ బయోపిక్ సినిమాలే బాగుంటున్నాయి.

సంచలనం సృష్టిస్తున్న గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తరువాత వెలుగుచూస్తున్న ఆగడాలు, ఆస్తులు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యం లో వర్మ ఊరికే ఉంటాడా.ఇంత హాట్ టాపిక్ ని వర్మ వదిలిపెడతాడా.అందుకే ఇదివరకే నయీమ్ స్టోరీ ని సినిమాగా తీస్తానని ప్రకటించేశాడు.తాజాగా ఆ సినిమాకు సంబంధిచి ఓ ఔత్సాహిడు డిజైన్ చేసిన నయీమ్ పోస్టర్ ని షేర్ చేసాడు వర్మ.పోస్టర్ మాత్రం చాలా క్రియేటివ్ గానూ ఇన్నోవేటివ్ గానూ వుంది.మరి వర్మ ఇంకెంత క్రియేటివ్ గా ఈ సినిమా తీస్తాడో చూడాలి మరి.