రెడ్డి గారికి మళ్ళీ కెసిఆర్ గ్రేట్

నిప్పు లేనిదే పొగరాదు కదా..అలాగే ఎవరిపైనయినా ఒకటో రెండో సార్లు ఆరోపణలు వస్తే అందులో నిజం లేదనుకోవచ్చు కానీ పదే పదే ఏవ్ ఆరోపణలు, ఆ సదరు వ్యక్తి కూడా పదే పదే అవే తప్పిదాలు మళ్ళీ చేస్తుంటే కోవర్ట్ అనక ఇంకేమనాలో.ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ హోమ్ మంత్రి జానారెడ్డి గారి గురించే.

ఇంతకీ విషయమేంటంటే నయీమ్ ఎన్కౌంటర్ పై జానా తనదైన శైలిలో స్పందించారు.అదేనండి ఎప్పటిలాగే అధికార తెరాస పార్టీ ని పొగడ్తలతో ముంచెత్తారు.మాఫియా డాన్‌ నయీంను ప్రభుత్వం మట్టుబెట్టడంతో పౌర సమాజానికి మేలు జరిగిందని జానా కితాబిచ్చారు.ప్రభుత్వాన్ని ఈ విషయం లో అభినందించకుండా వుండలేకపోతున్నానన్నాడు.

అంతే పాపం కాంగ్రెసోల్లు మళ్ళీ తలలు పట్టుకున్నారు..అసలీయన తెలిసి మాట్లాడుతాడో..తెలీక మాట్లాడుతాడో..తెలిసీ తెలియనట్టు మాట్లాడుతాడో ఎవరికీ అర్థం కావడం లేదు.సీనియర్ లీడర్ గా అధికార పార్టీ వైఫల్యాల్ని ఎంగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్ష సభ్యునిగా జానా రెడ్డికుంది.అయితే ఈ రెడ్డిగారు మాత్రం అసలు పని గాలికొదిలి తెరాస ప్రభుత్వానికి చిడతలు వాయించడం మొదలుపెట్టాడు.

అయినా జానా రెడ్డి కి ఇదేమన్నా కొత్తా..ఆ మధ్య GHMC ఎన్నికల టైం లో అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 రూపాయల భోజన పథకానికి ఏకంగా ప్రచారకర్త జానారెడ్డి అన్నంతగా ఆ పథకాన్ని మోసుకెళ్లాడు.అదే కాదు ప్రతి సందర్భం లోను ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తడం తో సొంతపార్టీ లోనే జానా రెడ్డి పై విమర్శలు ఎక్కువయ్యాయి.ఏకంగా విషయం హైకమాండ్ దృష్టికెళ్ళిందంటే జానా నష్టం ఏ మేరకుందో పార్టీ పైన అర్థం చేసుకోవచ్చు.

చేయాల్సిందంతా చేసేసి చివలో ఒక టీమ్‌ లీడర్‌గా ఉంటూ అధికార పార్టీని ఎలా మెచ్చుకుంటానని ఎదురు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జానా రెడ్డి చెప్పడం కొసమెరుపు.