కార్తీ తో హీరోయిన్ రహస్య వివాహం

బిచ్చ గాడు సినిమా గుర్తుందా..అంత ఈజీ గా మర్చిపోయే సినేమానా అది..కేవలం 50 లక్షల పెట్టి పిచ్చైక్కారన్ అనే సినిమా డబ్బింగ్ రైట్స్ కొని దానికి బిచ్చగాడు అనే వినూత్న టైటిల్ పెట్టిన సినిమాకి దాదాపు 35 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.ఆ సినిమాలో నటించిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా కూడా మంచి మార్కులే కొట్టేసాడు.ఆంటోని సరసన చిత్ర కథా నాయకిగా సాట్నా టైటస్ నటించిన విషయం తెలిసిందే.

అయితే హీరోయిన్ సాట్నా టైటస్ వ్యక్తిగతంగా రచ్చకెక్కింది.ఈ మధ్యనే రహస్యంగా ఈ అమ్మడు పెళ్లి చేసేసుకుంది.పిచ్చైక్కారన్ చిత్రాన్ని తమిళ్ లో విడుదల చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తీ తో ఒక నెల ముందే రిజిస్టర్ పెళ్లి జరిగిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే సాట్నా అంగీకరించిన సినిమాలకి అద్వాన్సులు కూడా వెనక్కి ఇచ్చేస్తోంది కోలీవుడ్ సమాచారం.

అయితే ఈ పెళ్లి సాట్నా తల్లి కి మాత్రం ఇష్టం లేదని, కార్తీ నే తన కూతురికి మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లిచేసుకున్నాడని ఇప్పటికే నడిఘర్ సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే కార్తీ వాదన ఇంకోలా వుంది.మేము ఇరువైపులా పెద్దల అంగీకారం తోనే పెళ్లి చేసుకున్నామని ఇంకో సారి అందరి ముందు ఘనంగా పెళ్లి చేసుకుంటామంటూ కార్తీ చెప్పడం గమనార్హం.