ముఖేష్ అంబానీ కొడుకుతో ఆ హీరోయిన్ ఎఫైర్‌..

November 10, 2016 at 11:12 am

మీడియాకు మ‌సాలా వార్త‌లు అల్లేయ‌డం ఎంత ఇంట్ర‌స్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మాసాలాలు క్రియేట్ చేయ‌డంలో దేశంలో మిగిలిన మీడియాల క‌న్నా బాలీవుడ్ మీడియా మిగిలిన వాళ్ల‌కు అంద‌నంత దూరంలో ఉంది. ఈ క్ర‌మంలోనే ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సంప‌న్నుడైన రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకుతో ఎఫైర్ న‌డుపుతోందంటూ బీ టౌన్ మీడియాలో వార్త‌లు జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

బాలీవుడ్ హాట్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ఏం చేసినా మీడియాకు పెద్ద సంచ‌ల‌న‌మే. కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌తో అఫైర్ న‌డిపిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత అత‌డికి గుడ్‌బై చెప్పేసి… ర‌ణ‌బీర్ క‌పూర్‌తో హాట్ హాట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపింది. వీరిద్ద‌రు విదేశాల్లో బీచ్‌ల్లో ఎంత హాట్ హాట్‌గా ప్రేమాయ‌ణం కొన‌సాగించారో..క‌త్రినా ర‌ణ‌బీర్‌తో బికినీల్లో ఎంత హాట్ హాట్‌గా మీడియాకు దొరికిపోయిందో అంద‌రం చూశాం.

ర‌ణ‌బీర్‌తో ఆమె ప్రేమ పీఠ‌ల వ‌ర‌కు వెళుతుంద‌ని అనుకుంటున్న టైంలో స‌డెన్‌గా వీరు ఎడ‌మెఖం పెడ‌ముఖంగా మారిపోయారు. ఒక‌రిపై మ‌రొక‌రు సూటిపోటి మాట‌లు కూడా విసురుకున్నారు. ఇక ఇప్పుడు క‌త్రినా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీతో చెట్టా ప‌ట్టాలేసుకుని తిరుగుతోంద‌న్న న్యూస్ బీ టౌన్‌లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

ఇటీవ‌ల‌ అమితాబ్ బచ్చన్ ఇచ్చిన‌ దివాలి బాష్ కి.. ఇద్దరూ కలిసి ఒకే కారులో జంటగా వచ్చేసి వీరిద్ద‌రూ అక్క‌డ చాలామందికి షాక్ ఇచ్చేశార‌ట‌. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే ఇదే కార్య‌క్ర‌మంలో మాజీ ప్రియుడు రణబీర్ కూడా ఉన్నా.. క‌త్రినా అటు వైపు క‌నీసం తొంగి కూడా చూడలేదు. ఇంకేముందు బీ టౌన్ మీడియా క‌త్రినా ఆకాష్‌తో ఎఫైర్ న‌డిపేస్తుందంటూ  వార్త‌లు రాసేసింది. షాక్ ఏంటంటే ముఖేష్ అంబానీ త‌నయుడు ఆకాష్ …క‌త్రినా కంటే వ‌య‌సులో ఎనిమిదేళ్లు చిన్న‌వాడు కావ‌డం.

 

ముఖేష్ అంబానీ కొడుకుతో ఆ హీరోయిన్ ఎఫైర్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts