చంద్ర‌బాబుకు మొద‌లైన 9 ఫీవ‌ర్

January 30, 2017 at 12:34 pm

ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి సీఎం చంద్ర‌బాబుకు అన్నీ స‌మ‌స్య‌లే! రెవెన్యూ లోటు, కాపు రిజ‌ర్వేషన్లు, ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మం.. ఇలా నిత్యం ఏదో ఒకది వెంటాడుతూనే ఉంది! వీటన్నింటినీ ఎలాగో నెట్టుకు వ‌స్తున్న ఆయ‌న‌కు.. ఇప్పుడు ఒక సెంటిమెంట్ భ‌యం ప‌ట్టుకుంది. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబుతో పాటు టీడీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అదేంటంటే.. చంద్ర‌బాబు నాయుడుకి 9 నంబ‌ర్‌తో ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది.

సీఎం చంద్ర‌బాబుకు న‌మ్మ‌కాలు ఎక్కువే! ఈ విష‌యం అమ‌రావ‌తి శంకుస్థాప‌న విష‌యంలో బ‌య‌ట‌ప‌డింది! అలాగే తాత్కాలిక స‌చివాల‌య భ‌వ‌న నిర్మాణం పూర్తి కాక‌ముందే గృహ‌ప్ర‌వేశం చేశారు. ఆయ‌న‌కు సెంటిమెంట్లు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌డానికి ఇవి కొన్ని మ‌చ్చుతున‌క‌లు మాత్ర‌మే! అస‌లే ఆయ‌నకి న‌మ్మ‌కాలు ఎక్కువనుకుంటే.. ఇప్పుడు ఈ 9 సెంటిమెంట్ తెర‌మీదికి వ‌చ్చింది. ఇది కాస్త టెన్ష‌న్ పెంచే అంశ‌మే అనాలి!

అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తొమ్మిదేళ్లు సీఎంగా ప‌నిచేశారు, ఇక 1999లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయారు! ఆ త‌రువాత‌, ఏకంగా 9 ఏళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉండి రికార్డు సృష్టించారు. త‌ర్వాత 2004లో ఓడిపోయారు. ఇక 2009లో అధికారంలోకి వ‌స్తార‌ని భావించారు. ఆ తర్వాత 2009 ఎన్నిక‌ల్లో చిరంజీవి ఆయ‌న ఆశ‌ల‌కు గండికొట్టారు! అలా చివర 9 వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆయ‌న అధికారినికి దూరంగానే ఉంటున్నారు. ఇక ఇప్పుడు 2019లో ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్నాయి! దీంతో టీడీపీ నాయ‌కుల‌కు 9 ఫీవ‌ర్ పట్టుకుంది.

2019 ఎన్నిక‌లు కూడా బాబుకు విష‌మ ప‌రీక్షే! ఒక‌వైపు జ‌గ‌న్‌.. మ‌రోప‌క్క ప‌వ‌న్ క‌ల్యాణ్‌! ఇక కాపుల రిజ‌ర్వేష‌న్ స‌మ‌స్య ఉండ‌నే ఉంది! రాజ‌ధాని నిర్మాణంలో క‌ద‌లిక లేదు. హోదా విష‌యంలో ఇక కేంద్రం చెప్పిన‌ట్లు వినాల్సిందే! ఈ విష‌యంలో టీడీపీపై ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్న విష‌యం తెలిసిందే! ఇక 2014లో టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. 2019 ఎన్నిక‌ల నాటికి కీల‌కంగా మారుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక టీడీపీతో క‌టీఫ్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులేస్తున్నారు! మ‌రి అటు సెంటిమెంట్‌ను, ఇటు స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి చంద్ర‌బాబు 2019లో అధికారంలోకి వ‌స్తారో లేదో వేచిచూడాల్సిందే!

 

చంద్ర‌బాబుకు మొద‌లైన 9 ఫీవ‌ర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts