డాన్స్ లే కాదు సర్కస్ కూడా చేస్తా

January 19, 2017 at 10:48 am

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే అందం అభినయం ఉంటే సరిపోయేది.కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి.అందంతో పాటు జీరో సైజు లు పై మోజు పెంచేశారు హీరోయిన్స్.ప్రేక్షకులు కూడా బొద్దుగా వుండే హీరోయిన్స్ కంటే నాజూగ్గా ఉంటేనే ఇష్టపడుతున్నారు.

ఒకప్పటి హీరోయిన్స్ అయితే చక్కగా ముఖారవిందాలకే ప్రాధాన్యతనిచ్చేవారు.అయితే ఇప్పటి తరం మాత్రం రోజూ గంటల తరబడి జిమ్ అని యోగా అని చమటోడుస్తూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిగో ఈ ఫొటోలో వుంది ఎవరో సర్కస్ అమ్మాయి అనుకుంటే పొరపాటే.. మన తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచయమైన ముద్దుగుమ్మ ఆదా శర్మ.హార్ట్ ఎటాక్ మూవీ తో తెలుగులో తెరంగ్రేటం చేసిన ఈ అమ్మడు ఆతరువాత సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమై పోయింది.అయితేనేం ఫిట్నెస్ పై శ్రద్ధతో బాడీ ని ఎలా బెండ్ చేసేస్తోందో చూడండి.

డాన్స్ లే కాదు సర్కస్ కూడా చేస్తా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts