ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో జగనే ముందు

దేశం లో ఇంటర్ నెట్ వినియోగం రోజు రోజు కి పెరిగిపోతుంది అలాగే యువతకు సినిమాలతో పాటు రాజకీయాలపై మక్కువ పెరుగుతుంది. తమకు నచ్చిన రాజకీయ నాయకుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు తమ ప్రియతమ నాయకుడు గురించి గూగుల్ సెర్చ్ లో తెగ వెతికేస్తుంటారు ఇలాగే గూగుల్ తమ ట్రేండింగ్ సెర్చెస్ సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఉన్నారట. వారితో సమానం గా సెర్చ్ చేసింది మరిఎవరినో కాదు వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డినే అట అలాగే రోజు రోజు కు జగన్ ను సెర్చ్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుందట.

ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు బయటకి వచ్చింది అనుకుంటున్నారా, మరో రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో గూగుల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని పరిశీలించగా ఈ విషయం తేలినట్లు జాతీయ మీడియా కోడై కూస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్ర బాబు మరియు కెసిఆర్ గురుంచి అసలు పెద్దగా నెటిజన్లు పట్టించుకోవడం లేదు. ఒక వేళా వారిద్దరి పేరుమీద సెర్చ్ చేసిన అవి జగన్ తో పోల్చుకుంటే చాలా తక్కువట.

మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బాగ్యనగరమైన హైదరాబాద్ లో కూడా నరేంద్ర మోడీ, కేజ్రీవాల్ గురించి ఎక్కువగానే సెర్చ్ చేశారట. విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే రాష్ట్ర నాయకుల కంటే జాతీయ స్థాయి నాయకుల గురించే ఎక్కువగా సెర్చ్ చేయడం గమనార్హం. మొత్తానికి సోష‌ల్ మీడియాలో వైసీపీకి ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇది పార్టీకి బ‌లాన్ని చేకూర్చే అంశ‌మే!!