బాహుబ‌లి 2 రిలీజ్ వేళ‌… ఏపీలో ర‌చ్చ మొద‌లు

స‌రిగ్గా రెండు సంవ‌త్స‌రాల వెయింట్‌, ఎంతో స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ మ‌రో మూడు రోజుల్లో బాహుబలి – ది కంక్లూజ‌న్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాహుబ‌లి 2 ఏకంగా 9 వేల థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. టిక్కెట్ల కోసం ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు..రాజ‌కీయ నాయ‌కులు, ఎమ్మెల్యేలు ఇంకా చెప్పాలంటే బాహుబ‌లి 2 టిక్కెట్ల కోసం ఏకంగా మంత్రులు సైతం రంగంలోకి దిగుతున్నారంటే బాహుబ‌లి క్రేజ్ అర్ధ‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే బాహుబ‌లి 2 పై ఏపీలో పెద్ద ర‌చ్చ జ‌రుగుతోంది. ఇది బాహుబ‌లి అభిమానులను తెగ టెన్ష‌న్ పెడుతోంది. బాహుబ‌లి 2 సినిమాను ఏపీలో తొలి 10 రోజుల పాటు 6 షోలు వేసుకునేలా ప్ర‌భుత్వ అనుమ‌తి ఇచ్చింది. సినిమాపై ఉన్న అంచ‌నాలు, క్రేజ్ దృష్ట్యా టిక్కెట్ల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ అనుమ‌తులు ఇచ్చింది.

బాహుబ‌లి నిర్మాత‌లు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూడా రోజుకు 6 షోల‌కు అనుమ‌తులు అడిగినా అక్క‌డ 5 షోల‌కే అనుమ‌తులు వ‌చ్చాయి. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. బాహుబలి-2కి ఏపీలో ఆరు షోలు అనుమతించడంపై ప్రేక్షకుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. అది చ‌ట్ట విరుద్ధ‌మ‌ని చెపుతోన్న ఆ సంఘం ఈ జీవోను ర‌ద్దు చేయాల‌ని హోం శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అనూరాధ‌ను కోరింది.

దీనిని వారు ఇక్క‌డితే వ‌దిలేలా లేరు. ప్ర‌భుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వ‌క‌పోతే తాము కోర్టును సైతం ఆశ్ర‌యిస్తామ‌ని చెపుతున్నారు. మ‌రో రెండు రోజుల్లో బాహుబ‌లి 2 థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న టైంలో ఏపీలో షోల మ్యాట‌ర్‌లో ఈ కాంట్ర‌వర్సీ రేగ‌డం బాహుబ‌లి అభిమానుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.