ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ ” ఇంజ‌నీర్‌బాబు ” కు కొత్త టైటిల్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. జ‌ల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో టాలీవుడ్ స‌ర్కిల్స్‌లోను, ట్రేడ్‌వ‌ర్గాల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలో బిజీగా ఉన్న ఈ సినిమాపై టైటిల్‌పై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు ఇప్పటికే ” ఇంజ‌నీర్‌బాబు ” అనే టైటిల్ ఫైనల్ చేశారంటూ ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యింది. అయితే ఈ టైటిల్‌పై చిత్ర‌యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు. ఈ టైటిల్ ట్రెండ్ అవుతుండ‌గానే ఇప్పుడు టైటిల్‌పై మ‌రో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ క్రేజీ ప్రాజెక్టుకు త్రివిక్రమ్ మార్క్ కనిపించేలా ” పరదేశ ప్రయాణం ” అనే టైటిల్ ఫిక్స్ చేశారట. అయితే దీనిపై కూడా అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ప‌వ‌న్ చివ‌రి రెండు సినిమాలు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ – కాట‌మ‌రాయుడు డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ మార్క్ మూవీగా తెర‌కెక్కుతోన్న

ఈ సినిమా ప‌వ‌న్ కేరీర్‌లో 25వ సినిమాగా తెర‌కెక్కుతుండ‌డంతో అంచ‌నాలు మ‌రింత హైప్‌గా ఉన్నాయి. ఇక ఏక‌ధాటిగా జ‌రిగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను కంప్లీట్ చేసి సెప్టెంబ‌ర్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.