బాహుబ‌లికి ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ ఇదే

బాహుబ‌లి సినిమా కోసం రాజ‌మౌళి త‌ర్వాత ఆ స్థాయిలో క‌ష్ట‌ప‌డింది…అంత క‌మిట్‌మెంట్ చూపించింది ఎవ‌రైనా ఉన్నారంటే ఒక్క ప్ర‌భాస్ మాత్ర‌మే. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ ఏకంగా నాలుగు సంవ‌త్స‌రాల టైం కేటాయించాడు. ఓ మ‌నిషి జీవితంలో నాలుగు సంవ‌త్స‌రాల టైం అంటే మామూలు విష‌యం కాదు.

ఓ హీరో నాలుగేళ్లలో ఏడెనిమిది సినిమాలు చేసేసి ఉండొచ్చు. ఎంతో సంపాదించి ఉండొచ్చు. కానీ ప్రభాస్ అలా చేయలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించేసి ఇండియా వైజ్‌గా చాటిన ఈ సినిమా కోస‌మే నాలుగేళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు. ఇక ఈ సినిమాలో న‌టించినందుకు ప్ర‌భాస్‌కు ఎంత ఇచ్చినా త‌క్కువే.

అయితే ప్ర‌భాస్ నాలుగేళ్ల విలువ‌ను బాహుబ‌లి నిర్మాత‌లు రూ.75 కోట్లుగా తేల్చినట్లు సమాచారం. వాస్త‌వానికి బాహుబ‌లి తొలిపార్ట్‌కు ప‌నిచేసేందుకు ప్ర‌భాస్ త‌న పాత రేంజ్‌లోనే రెమ్యున‌రేష‌న్ అడిగాడ‌ట‌. అయితే బాహుబ‌లి పార్ట్ వ‌న్ అంచ‌నాల‌కు మించి హిట్ అవ్వ‌డం…ఇప్పుడు బాహుబ‌లి 2పై హైరేంజ్‌లో అంచ‌నాలు ఉండ‌డంతో నిర్మాత‌లు ప్ర‌భాస్‌కు రూ.75 కోట్లు ఇచ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్‌.

ప్ర‌భాస్‌కే ఈ రేంజ్ రెమ్యున‌రేష‌న్ మ‌రి రాజ‌మౌళి టోట‌ల్ ఫ్యామిలీకి ఎంత రెమ్యురేష‌న్ ముట్టి ఉంటుందో అన్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్నాయి.