బాల‌కృష్ణ హిట్ సినిమా లాక్కున్న ఎన్టీఆర్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కేరీర్‌లో వ‌చ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్‌కు చాలా త‌క్కువ యేజ్‌లోనే తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను తీసుకువ‌చ్చింది. 2003లో వ‌చ్చిన సింహాద్రి అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాసింది. సింహాద్రి ఎన్టీఆర్‌ను సూప‌ర్‌స్టార్‌ను చేస్తే, రాజ‌మౌళిని స్టార్ డైరెక్ట‌ర్‌గా మార్చేసింది.

ఈ సినిమాకు కథ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌. తాజాగా ఆయన చాలా రోజుల త‌ర్వాత ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ‌ను ఎన్టీఆర్ కోసం రాయ‌లేద‌ట‌…యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణను దృష్టిలో ఉంచుకునే ఈ కథను రాశాడ‌ట‌.

అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల బాల‌య్య ఆ క‌థ‌ను చేయ‌డానికి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో…ఆ క‌థ‌లో మార్పులు చేసి ఎన్టీఆర్‌కు అనుగుణంగా మార్చార‌ట‌. ఆ కథ ఎన్టీఆర్‌కు నచ్చ‌డంతో సింహాద్రి సినిమాగా తెర‌కెక్కింది.

ఈ సినిమాలోని భూమిక రోల్‌కు ‘వసంతకోకిల’లోని శ్రీదేవి రోల్‌ స్ఫూర్తి’అని చెప్పాడు విజయేంద్రప్రసాద్‌. వీఎంసీ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై వి.దొర‌స్వామి రాజు ఈ సినిమాను నిర్మించారు. అంకిత మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. 2003 జూలై 9న ఈ సినిమా రిలీజ్ అయ్యి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. సో అలా బాల‌య్య‌కు ద‌క్కాల్సిన బ్లాక్ బ‌స్ట‌ర్ చివ‌ర‌కు ఎన్టీఆర్ అక్కౌంట్‌లో ప‌డింది.