న‌టుడు ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య కేసులో కొత్త కోణం

May 3, 2017 at 1:01 pm

బుల్లితెర నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య కేసులో కొత్త కోణం బ‌య‌ట ప‌డింది. ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత అత‌డి స్నేహితులు స్పందిస్తున్నారు. ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని… అత‌డి భార్య పావ‌నీరెడ్డితో ప్రొఫైల్ ఫొటోపై జ‌రిగిన గొడ‌వ వ‌ల్లే అత‌డు మ‌న‌స్థాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని వారు ఆరోపిస్తున్నారు.

ప్ర‌దీప్ ఇంట్లో గ‌త మూడు నెల‌లుగా శ్రావ‌ణ్ అనే వ్య‌క్తి ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. అత‌డితో పావ‌నీరెడ్డి స‌న్నిహితంగా ఉన్న ఫోటోను ఆమె ప్రొఫైల్ పిక్చ‌ర్‌గా పెట్టుకుంద‌ని…ఈ విష‌య‌మై ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ని, మ‌న‌స్థాపానికి గురైన ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని టాక్ వ‌స్తోంది.

ఇక ప్ర‌దీప్‌కు పావ‌నీరెడ్డికి మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా గొడ‌వ‌లు న‌డుస్తున్న‌ట్టు కూడా ప్ర‌దీప్ కుటుంబ స‌భ్యుల వెర్ష‌న్‌గా తెలుస్తోంది. ఇక పోలీసులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు కూడా పావ‌నీరెడ్డి దాట‌వేత ధోర‌ణిలో స‌మాధానం చెప్ప‌డంతో ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య‌పై చాలా సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

న‌టుడు ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య కేసులో కొత్త కోణం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts