ఇండియాలో 4Gస్పీడ్ ఇంత వ‌ర‌స్టా

June 8, 2017 at 8:35 am

రిల‌య‌న్స్ జియో 4G ఎంట్రీతో ప్ర‌స్తుతం దేశంలో ఇంట‌ర్నెట్ 4G విప్ల‌వం న‌డుస్తోంది. ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల్లో 4G అనేది పెద్ద టాపిక్ అయ్యింది. జియో 4G మారుమూల బ‌స్సులు తిర‌గ‌ని, రోడ్లు స‌రిగా లేని గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్త‌రిస్తోంది. మిగిలిన టెలికం ఆపరేటర్లైతే కస్టమర్లను ఆకట్టుకోవడానికి 4G ఆఫర్లతో మురిపిస్తున్నాయి. ఇలా ఎవ‌రెన్ని ఆఫ‌ర్లు ఇస్తున్నా మ‌న‌దేశంలో 4G డౌన్‌లోడ్ స్పీడ్ చాలా చాలా అధ్వానంగా ఉంద‌ని వెల్ల‌డైంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు డౌన్ లోడ్ స్పీడులో మూడువంతు కంటే కూడా చాలా త‌క్కువుగా ఇండియాలో 4G నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ ఉంది. ఇక్క‌డ 4G డౌన్‌లోడ్ స్పీడ్ కేవలం 5.1ఎంబీపీఎస్ మాత్రమేనని టెలికాం రెగ్యులేటరీ వెల్లడించింది. ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న 3G నెట్ స‌గ‌టు స్పీడ్ కంటే చాలా త‌క్కువ‌.

ఇండియాలో 3G స‌గటు డౌన్‌లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్ ఉంటే చాలా మందికి ఇది 10 కేబీపీఎస్ ఉందంటే ఇక్క‌డ డౌన్‌లోడ్ స్పీడ్ ప్ర‌పంచ స‌గ‌టుతో పోలిస్తే ఎంత త‌క్కువో అర్థ‌మ‌వుతోంది. ఇక రిల‌య‌న్స్ జియో 4G ఎంట్రీతో ట్రాఫిక్ విప‌రీతంగా పెరిగిపోయి డౌన్ లోడ్ స్పీడ్ రోజు రోజుకు స్పీడ్‌గా ప‌డిపోతోంది.

డౌన్ లోడ్ స్పీడులో పాకిస్తాన్, శ్రీలంక దేశాలకంటే ఇండియా పరిస్థితే అధ్వానంగా ఉంది. దీనిలో భారత్ 74వ స్థానంతో సరిపెట్టుకుంది. సింగపూర్ దేశం 4G స్పీడులో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సగటు 4జీ డౌన్ లోడ్ స్పీడు 16.2 ఎంబీపీఎస్ గా ఉంది.

 

ఇండియాలో 4Gస్పీడ్ ఇంత వ‌ర‌స్టా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts