బాల‌య్య – పూరి సినిమాకు మూడు టైటిల్స్‌..ఏది ఫిక్సో

టైటిల్స్ విష‌యంలో పూరి జ‌గ‌న్నాథ్ మైండ్‌సెట్ ఎక్కువుగా నెగిటివ్ ట‌చ్చింగ్‌తోనే ఉంటుంది. ర‌వితేజ‌ను ఇడియ‌ట్ చేసినా, మ‌హేష్‌ను పోకిరిని చేసినా, వ‌రుణ్‌తేజ్‌ను లోఫ‌ర్‌ను చేసినా, ఇషాంత్‌ను రోగ్‌ను చేసినా పూరీకే చెల్లింది. వాళ్లంతా యంగ్ హీరోలు కావ‌డంతో పూరి అలాంటి నెగిటివ్ ట‌చ్ ఉన్న టైటిల్స్ బాగా యాప్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు పూరి యువ‌ర‌త్న బాల‌కృష్ణ‌తో తెర‌కెక్కిస్తోన్న బాల‌య్య 101వ సినిమా టైటిల్ విష‌యంలో సైతం పూరీ ఇలాంటి నెగిటివ్ ట‌చ్ ఉన్న టైటిల్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నాడ‌న్న వార్త‌లు బాల‌య్య ఫ్యాన్స్‌ను తెగ టెన్ష‌న్ పెట్టేస్తున్నాయి.

ఈ సినిమా కోసం భ‌వ్య క్రియేష‌న్స్ ఇప్ప‌టికే జై బాల‌య్య – ఉస్తాద్ – తేడాసింగ్ ఈ మూడు టైటిల్స్ రిజిస్ట‌ర్ చేసి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ మూడు టైటిల్స్‌లో జై బాలయ్య మాత్రం ఫ్యాన్స్‌కు పిచ్చ కిక్ ఇస్తోంది. గ‌తంలో నాని హీరోగా వ‌చ్చిన కృష్ణగాడి ప్రేమకథలో నానీ జైబాలయ్య అంటేనే బాలయ్య ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఊగిపోయారు. ఈ టైటిల్ పెడితే సినిమాకు మామూలుగా ఊపురాదు.

ఇక ఉస్తాద్ టైటిల్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్యకు సుల్తాన్ లాంటి టైటిల్స్ క‌లిసిరాలేదు. దీంతో ఉస్తాద్ టైటిల్ కూడా ఎంత వ‌ర‌కు యాఫ్ట్ అవుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. ఇక తేడా సింగ్ టైటిల్ పూరికి న‌చ్చేలా ఉన్నా బాల‌య్య ఫ్యాన్స్ మాత్రం అస్స‌లు ఒప్పుకునేలా లేరు.

ఏదేమైనా ఈ మూడు టైటిల్స్‌లో జై బాల‌య్య టైటిల్‌కు ఉన్న ఊపు మిగిలిన రెండు టైటిల్స్‌కు ఉండేలా లేదు. మ‌రి ఫైన‌ల్‌గా ఏ టైటిల్ సెట్ అవుతుందో చూడాలి.