చింత‌మ‌నేని గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా…

June 5, 2017 at 2:12 pm

చింతమ‌నేని ప్ర‌భాక‌ర్‌రావు స‌మైక్య రాజ‌కీయాల్లో ఈ పేరు రాజ‌కీయాల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నుంచి టీడీపీ త‌ర‌పున వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన చింత‌మ‌నేనికి కాంట్ర‌వర్సీ కింగ్‌గా పేరుంది. పార్టీలో సామాన్య కార్య‌క‌ర్త నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విప్‌గా ఉన్న ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. 2009 ఎన్నిక‌ల‌కు ముందు దెందులూరు జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించిన ఆయ‌న మంత్రి మాగంటి మంత్రి ప‌ద‌వి పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యాడు. ఆ దెబ్బ‌తోనే మాగంటి సుధీర్ఘ‌కాలంగా త‌న ఫ్యామిలీకి కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం తెంచేసుకుని టీడీపీలోకి జంప్ చేసేశారు. అది ప్ర‌భాక‌ర్ స‌త్తా.

ఇక 2009, 2014 ఎన్నిక‌ల్లో దెందులూరు నుంచి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్ర‌భాక‌ర్ ప‌నితీరులోను, కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండే విష‌యంలోను, నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి విష‌యంలో నూటికి నూరుశాతం మార్కులేయించుకున్నాడు. అయితే అధికారుల‌తోను, ఇత‌ర‌త్రా అంశాల్లోను ఆయ‌న దూకుడు ఆయ‌న‌కు పెద్ద మైన‌స్‌గా మారింది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఈ మూడేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో కావాల్సినంత అభివృద్ధి చేశాడు.

నియోజ‌క‌వ‌ర్గంలో మారుమూల గ్రామాల్లో సైతం రోడ్ల‌న్నీ సిమెంట్ రోడ్లుగా మారాయి. పుంత రోడ్లు కూడా కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి చేశారు. వ్య‌వ‌సాయాధిరిత నియోజ‌క‌వ‌ర్గ‌మైన దెందులూరులో పార్టీల‌కు అతీతంగా రైతుల ప‌క్ష‌పాతిగా ప్ర‌భాక‌ర్‌కు పేరుంది. ఇక రాజ‌కీయంగా ప్ర‌భాక‌ర్‌కు ఎప్పుడూ బ‌ల‌హీన‌మైన ప్ర‌త్య‌ర్థులే ఉండ‌డం చాలా ప్ల‌స్‌. 2009లో కొఠారు రామ‌చంద్ర‌రావు చాలా వీక్ క్యాండెట్‌. ఇక గ‌త ఎన్నిక‌ల్లో అప్పుడు త‌ణుకు ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి నాగేశ్వ‌ర‌రావు నాన్ లోక‌ల్‌గా దెందులూరులో పోటీ చేయ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లోను ఇక్క‌డ కొఠారు త‌న‌యుడు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. వీరెవ్వ‌రూ ప్ర‌భాక‌ర్‌కు స‌రితూగే వ్య‌క్తులు కారు. దీంతో అటు అభివృద్ధిలో దూకుడుకు తోడు, రాజ‌కీయంగా బ‌ల‌హీన ప్ర‌త్య‌ర్థులు ఉండ‌డంతో ప్ర‌భాక‌ర్ ఆడింది ఆట‌గా…పాడింది పాట‌గా ఉంది. ఇక ప్ర‌భాక‌ర్ కాంట్ర‌వ‌ర్సీల‌కు లెక్కేలేదు. ఎమ్మార్వో వ‌న‌జాక్షితో పాటు పోలీసులు, ఇత‌ర అధికారుల‌ను ఆయ‌న దూషించ‌డంతో పాటు చేయి చేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌కు లెక్కేలేదు.

ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వ్య‌తిరేక‌త‌….

ఎమ్మెల్యేగా ఈ ఎనిమిదేళ్ల‌లో తిరుగులేని ఏక‌చ‌క్రాధిప‌త్యంతో ఉన్న ప్ర‌భాక‌ర్‌కు నియోక‌వ‌ర్గంలో ఇప్పుడిప్పుడే వ్య‌తిరేక‌త మొదలయింది. అది చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. ప్ర‌భాక‌ర్ సొంత సామాజిక‌వ‌ర్గమైన కమ్మ సామాజిక‌వ‌ర్గంలోనే ఇది ఎక్కువుగా క‌నిపిస్తోంది. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాస్త తీవ్ర‌మైనా బ‌ల‌హీన ప్ర‌త్య‌ర్థుల‌తో చివ‌రి క్ష‌ణాల్లోనైనా  ప‌రిస్థితిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డం ప్రభాకర్ కి పెద్ద కష్టమైన పని కాకపోవచ్చు .

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– జ‌నాల్లో తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌

– నియోజ‌క‌వ‌ర్గంలో మారుమూల గ్రామాల్లోను అభివృద్ధి

– పిలిస్తే ప‌లికే వ్య‌క్తి

– నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భాక‌ర్ సొంత క‌మ్మ సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉండ‌డం

– దెందులూరులో చెక్కు చెద‌ర‌ని టీడీపీ ఓటు బ్యాంకు

– ఎన్ని వివాదాలున్నా జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేస్తాడ‌ని బాబుకు న‌మ్మ‌కం

– అభివృద్ధి, ప‌నుల కోసం అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌డం

– నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు తేవ‌డంలో తిరుగులేని నేర్ప‌రి

– జిల్లాలో ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా ప్ర‌భాక‌ర్ పేరు చెపితే ప‌నులు అవ్వ‌డం

– కార్య‌క‌ర్త‌లు, పార్టీ కోసం దూకుడు.

మైన‌స్ పాయింట్స్ (-) :

– మంత్రి ప‌ద‌వి రాలేద‌ని కొత్త పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న‌తో బాబు దృష్టిలో మైన‌స్‌

– ప్ర‌తి గ్రామంలోను ఒక వ‌ర్గానికే ప్ర‌యారిటీ ఇవ్వ‌డం

– కిందిస్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను ఇటీవ‌ల విస్మ‌రించ‌డం

– సీనియ‌ర్ల‌ను గౌర‌వించ‌ర‌న్న అప‌వాదు

– కాంట్ర‌వ‌ర్సీ కింగ్ అన్న బిరుదు

– అధికారుల్లో పైకి క‌న‌ప‌డ‌ని యాంటీ

తుది తీర్పు :

2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన చింత‌మ‌నేనికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్యారెంటీగా సీటు వ‌స్తుంది. పార్టీల‌తో సంబంధం లేకుండా ప్ర‌భాక‌ర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా తిరుగులేని విజ‌యం సాధిస్తాన్న టాక్ జిల్లాలో బ‌లంగా ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో మారుమూల గ్రామాల్లో కూడా తిరుగులేని అభివృద్ధి, సామాన్యుల దృష్టిలో టైగ‌ర్‌గా బ‌లంగా ఉన్న ముద్ర ఆయ‌న‌కు క‌లిసి రానున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బ‌రిలో ఉన్నా ఆ ఎఫెక్ట్ ఈ నియోజ‌క‌వ‌ర్గంపై చాలా చాలా త‌క్కువే ఉంటుంది. మరీ త‌ల్ల‌కిందులాంటి ప‌రిస్థితులు త‌లెత్తితే త‌ప్ప ప్ర‌భాక‌ర్‌కు హ్యాట్రిక్ గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కే.

 

చింత‌మ‌నేని గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts