వియ్యంకులుగా నాగార్జున – వెంక‌టేష్‌..?

July 12, 2017 at 7:34 am

అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ పెళ్లి మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. గ‌తంలో అఖిల్ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే రెడ్డి మ‌నువ‌రాలు శ్రియా భూపాల్‌ను ప్రేమించిన సంగ‌తి తెలిసిందే. అఖిల్ కంటే శ్రియా వ‌య‌స్సులో పెద్దది అయినా ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకుని గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేశాయి. ఇట‌లీలో వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గానే పెద్ద షాక్‌.

వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం… శ్రియ త‌న‌కు కాబోయో మామ‌గారు అని చూడ‌కుండా నాగ్‌ను ఓ ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లోనే దూషించ‌డం లాంటి కార‌ణాలు వీరి ప్రేమ ఎంగేజ్‌మెంట్‌తోనే బ్రేక‌ప్ అయ్యేందుకు కార‌ణాలు అన్న టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత అఖిల్ త‌న కెరీర్ మీద కాన్‌సంట్రేష‌న్ చేసి విక్ర‌మ్‌కుమార్ డైరెక్ష‌న్‌లో త‌న రెండో సినిమాలో న‌టిస్తున్నాడు.

ఇక ఇప్పుడు అఖిల్ పెళ్లి గురించి మ‌రో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. విక్ట‌రీ వెంక‌టేష్ పెద్ద కుమార్తెను అఖిల్‌కు ఇచ్చి పెళ్లి చేస్తార‌ట‌. త‌న కుమార్తెను అఖిల్‌కు ఇచ్చేందుకు వెంకీ సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వెంకీ పెద్ద కుమార్తె అఖిల్ కంటే కాస్త పెద్ద‌. ఆ మాట‌కు వ‌స్తే అఖిల్ ముందు ప్రేమించిన శ్రియా భూపాల్ కూడా అఖిల్ కంటే ఏకంగా నాలుగేళ్లు పెద్ద‌ద‌న్న సంగ‌తి తెలిసిందే.

గ‌తంలో వెంకీ చెల్లిని నాగ్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాగ‌చైత‌న్య పుట్టాక మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఆమె నుంచి విడిపోయిన నాగ్ అమ‌లు పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ బావ బావ‌మ‌రుదులు ఇద్ద‌రూ మ‌రోసారి వియ్యంకులు అయ్యే ఛాన్స్ వ‌చ్చింది. మ‌రి ఈ వార్త నిజ‌మ‌వుతుందో ? లేదా వార్త‌గానే మిగిలిపోతుందో ? వాళ్లే అన్స‌ర్ చెప్పాలి.

 

వియ్యంకులుగా నాగార్జున – వెంక‌టేష్‌..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts