ఫిదా TJ రివ్యూ

July 21, 2017 at 10:38 am

సినిమా : ఫిదా

న‌టీన‌టులు : వ‌రుణ్‌తేజ్‌,సాయిప‌ల్లవి,రాజా,సాయిచంద్‌,శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌,గీతా భాస్క‌ర్‌,హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే,నాథన్ స్మేల్స్ త‌దిత‌రులు.

ఛాయాగ్ర‌హ‌ణం :  విజ‌య్ సి.కుమార్‌

ఎడిటింగ్ :  మార్తాండ్ కె.వెంకటేష్

సంగీతం : శ‌క్తికాంత్‌

నిర్మాణం :  దిల్‌రాజు, శిరీష్‌

సంస్థ‌ : శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌

ద‌ర్శ‌క‌త్వం :  శేఖ‌ర్ క‌మ్ముల‌

డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనగానే గుర్తుకొచ్చేది ఫీల్ గుడ్ మూవీస్. అలాంటి శేఖర్ కమ్ముల తో  టాల్ అండ్ హ్యాడ్సమ్ లుక్ తో వుండే మెగా హీరో వరుణ్ తేజ్  సినిమా అనగానే సినిమాపై ఎక్సపెక్టషన్స్   క్రీట్ అయ్యాయి. ఈరోజు రిలీజ్ అయినా ఫిదా మూవీతో ఆ ఎక్సపెక్టషన్స్ ని ఎంతవరకు అందుకున్నారో చూదాం .

స్టోరీ పరంగా చుస్తే చాల సింపుల్ స్టోరీ ని ఎంచుకున్నాడు శేఖర్ కమ్ముల. తెలంగాణ లో ఒక మారుమూల పల్లెటూరిలో వుండే కుటంబంలో ని అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి ఒక NRI కుర్రాడు వస్తాడు. అయితే ఆ పెళ్లిచూపులు ఓకే అవటం వారంరోజులలో పెళ్లికూడా చేసుకుని వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ వారం రోజులలో పెళ్ళికొడుకు తమ్ముడు, పెళ్లికూతురు చెల్లెలు మధ్య ప్రేమ చిగురించటం అనేది కథాంశం.  ఆ NRI కి  తమ్ముడిగా వరుణ్ తేజ్, ఆ పెళ్లికూతురు చెల్లెలిగా సాయిపల్లవి నటించారు.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తెలంగాణ పల్లెటూరి వాతావరణం లో సాగుతుంది. భానుమతి క్యారెక్టర్  ప్రెసెంటేషన్ ఎంతెర్తైనింగ్ గా అద్భుతంగా వుంది. ఒకరకంగా సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం భానుమతికోసమే అన్నట్టుగా వుంది. తెలంగాణ నేటివిటీని చూపించటం లో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడు. అయితే మొదటిభాగం లో గ్రిప్పింగ్ గా వున్నా స్క్రీన్ప్లే రెండోభాగానికి వచ్చేసరికి మిస్ అయ్యింది. 

వ్యవసాయ దారుడి కూతురిగా పుట్టి అగ్రికల్చర్ B.sc  చదువుతూ, తాను వుండే వూరు, తనవాళ్ళే ప్రపంచంగా పెళ్లి తరువాతకూడా అక్కడే ఉండిపోవాలనుకునే చలాకి పల్లెటూరి పిల్ల భానుమతిగా సాయి పల్లవి జీవించింది. భానుమతి క్యారెక్టర్ సినిమాకి ప్రాణం అయితే ఆ ప్రాణాన్ని సాయిపల్లవి తన భుజాలపై ఈజీగా మోసేసింది. NRI కుర్రాడిగా వరుణ్ తేజ్ బాగా సూట్ అయ్యాడు. మిగిలిన క్యారెక్టర్స్ అంతా తమతమ పరిధిలో బాగానే చేసారు. మొత్తంగా సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపించినా సెకండ్ హాఫ్ అయ్యే సరికి ఓకే అనిపించింది.

 

రేటింగ్ : 3/5

సాయి పల్లవికి ‘ఫిదా’ అవ్వాల్సిందే

 

ఫిదా TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts