ఊర మాస్ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌

July 3, 2017 at 5:56 am

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం ఇటు మురుగ‌దాస్ స్పైడ‌ర్ సినిమాతో పాటు అటు కొర‌టాల శివ భ‌ర‌త్ అనే నేను సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. స్పైడ‌ర్ సెప్టెంబ‌ర్ 27న వ‌స్తుందంటున్నారు. ఇక భ‌ర‌త్ సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని మ‌హేష్ ప్లాన్ చేస్తున్నాడు. స్పైడ‌ర్ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతుండ‌గా, భ‌ర‌త్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అంటున్నారు.

ఇక ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌హేష్ త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కే సినిమాను వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ ఓ ఊర‌మాస్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర హీరో బాల‌కృష్ణ‌కు సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చిన బోయ‌పాటి టాలీవుడ్‌లో హీరోల‌ను ఊర‌మాస్‌గా ఎస్టాబ్లిష్ చేసేందుకు కేరాఫ్‌గా మారాడు.

బ‌న్నీని స‌రైనోడు సినిమాతో మాస్ హీరోగా ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. ఇక ఇటీవ‌ల మీట్ అయ్యి, చ‌ర్చ‌ల్లో కూర్చోన్న బోయ‌పాటి, మ‌హేష్ క‌లిసి ప‌నిచేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. బ‌హుశా మ‌హేష్ 26వ సినిమాను బోయపాటి డైరెక్ట్ చేస్తాడ‌ని తెలుస్తోంది.

 

ఊర మాస్ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts