మంచు విష్ణుకి యాక్సిడెంట్‌

July 30, 2017 at 10:01 am

టాలీవుడ్ హీరో మంచు విష్ణు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మలేషియాలో షూటింగ్ జరుగుతుండగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ విష‌యం తెలియ‌డంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మొత్తం ఇప్పుడు షాక్‌లో ఉంది. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ మలేషియాలో నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఓ బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండ‌గా బైక్ స్కిడ్ అవ్వ‌డంతో ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చిత్ర‌యూనిట్ విష్ణును మలేసియాలోని పుత్రజయ ఆసుపత్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం విష్ణు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం విష్ణుకు తీవ్ర గాయాలు అయినా ప్రాణానికి ఎటువంటి హాని లేదని డాక్టర్లు వెల్లడించిన‌ట్టు తెలుస్తోంది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుతో పాటు బ్రహ్మనందం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మ‌లేసియాలో జ‌రుగుతోంది. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మంచు విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

మంచు విష్ణుకి యాక్సిడెంట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts