ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రికార్డును బీట్ చేసిన నాని

నేచుర‌ల్‌స్టార్ నాని త‌న తాజా చిత్రం నిన్ను కోరి సినిమాతో వ‌రుస‌గా ఏడో హిట్ అందుకున్నాడు. ఈ క్ర‌మంలోనే హిట్ టాక తెచ్చుకున్న నిన్ను కోరి సినిమా ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికే రూ. 20 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి లాభాల భాట‌లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో నాని ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ సాధించారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన అల్లు అర్జున్ డీజే సినిమా ఓవ‌ర్సీస్‌లో ఈ మార్క్ సాధించేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డితే నిన్ను కోరితో నాని చాలా సులువుగానే మిలియ‌న్ మార్క్ దాటేశాడు.

ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు నాని సినిమా అంటేనే ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటుంద‌ని న‌మ్మ‌డంతో పాటు థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్ట‌డంతో అక్క‌డ నాని సినిమాల‌కు క‌లెక్ష‌న్ల క‌న‌క‌వ‌ర్షం కురుస్తోంది. ఈ క్ర‌మంలోనే నాని నిన్ను కోరి సినిమాతో ఓవ‌ర్సీస్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రికార్డును బీట్ చేసేశాడు. 

నిన్ను కోరి మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడంతో నాని ఖాతాలో ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్ సినిమాల‌తో క‌లిసి మొత్తం నాలుగు మిలియ‌న్ డాల‌ర్ సినిమాలు ఉన్న‌ట్లైంది. ఇక ప‌వ‌న్‌కు అత్తారింటికి దారేది, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, గోపాలా గోపాలాతో క‌లుపుకుండే మూడు మిలియ‌న్ డాల‌ర్ సినిమాలు ఉన్నాయి. 

ఇక ఎన్టీఆర్‌కు కూడా అక్క‌డ నాలుగు మిలియ‌న్ డాల‌ర్ సినిమాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, టెంపర్, బాద్ షా సినిమాల‌తో నాలుగు మిలియ‌న్ డాల‌ర్ల సినిమాల రికార్డు ఉన్న ఎన్టీఆర్ స‌ర‌స‌న ఇప్పుడు నాని చేరిన‌ట్ల‌య్యింది.