ఎన్టీఆర్ ” జై ల‌వ‌కుశ ” టీజ‌ర్‌ టాక్

July 6, 2017 at 1:21 pm

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంత‌గానో వెయిట్ చేస్తోన్న జై ల‌వ‌కుశ టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ అయ్యింది. 46 సెక‌న్ల పాటు ఉన్న టీజ‌ర్‌లో ఎన్టీఆర్ జై క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఈ టీజ‌ర్ అన్ని వ‌ర్గాల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తోన్న మూడు పాత్ర‌ల్లో జై పాత్ర నెగిటివ్‌గా ఉన్న‌ట్టు టీజ‌ర్ చెపుతోంది.

యాక్ష‌న్ క‌ట్‌తో పాటు ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో ఎన్టీఆర్ చంపేశాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని రోల్‌ను పోషిస్తున్న‌ట్టు క్లీయ‌ర్‌గా తెలిసిపోతోంది. ఎన్టీఆర్ మేన‌రిజ‌మ్స్‌, లుక్స్‌, డైలాగ్ డెలివ‌రీ, క‌ళ్ల‌ల్లో తీక్ష‌ణ‌త ఇలా అన్ని క‌లిపి ఈ నెగిటివ్ షేడ్ రోల్ ఉన్న ఈ టీజ‌రే సినిమా అంచ‌నాలు పెంచేసింది.

ఇక జై క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ రాయ‌ల‌సీమ యాస‌లో చెప్పి డైలాగ్ డెలివ‌రీతో పాటు కాస్త న‌త్తి కూడా ఉన్న‌ట్టు చెపుతోంది. ఇదిలా ఉంటే జై ల‌వ‌కుశ టీజ‌ర్ రిలీజ్ తొలి అర‌గంట‌లో మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ టీజ‌ర్‌కు వ‌చ్చిన వ్యూస్ రికార్డును క్రాస్ చేసేసింది. ఇట‌వ‌ల వ‌చ్చిన టాప్ హీరోల సినిమాల‌కు ఏకంగా కోటి వ్యూస్ వ‌స్తున్నాయి.

ఇప్పుడు ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌కు ఏకంగా మూడు క్యారెక్ట‌ర్ల‌కు సంబంధించి మూడు టీజ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో జై ల‌వ‌కుశ టీజ‌ర్ ఏ స్థాయిలో వ్యూస్ రాబ‌ట్టుకుంటుంది అన్న‌ది కాస్త సందేహంగా ఉంది. ఈ మూడు టీజ‌ర్లు టాప్ హీరోల సినిమాల టీజ‌ర్ల‌కు వ‌చ్చిన రేంజ్‌లో వ్యూస్ రాబ‌ట్టుకుంటే ఎన్టీఆర్‌కు తిరుగులేని రికార్డు అవుతుంది. కాని వీటికి విడివిడిగా వ‌చ్చిన వ్యూస్ త‌క్కువుగా ఉంటే ఎన్టీఆర్ టాప్ రికార్డు మిస్ చేసుకున్న‌ట్ల‌వుతుంది. మ‌రి దీనిని ఎన్టీఆర్ ఎలా అధిగ‌మిస్తాడో ? చూడాలి.

 

ఎన్టీఆర్ ” జై ల‌వ‌కుశ ” టీజ‌ర్‌ టాక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts