కాంట్ర‌వ‌ర్సీలో ” జై ల‌వ‌కుశ‌ “

July 10, 2017 at 3:33 am

ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ టీజ‌ర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఒక్క టీజ‌ర్‌తోనే సినిమాపై ఎక్క‌డా లేని అంచ‌నాలు పెరిగిపోయాయి. రావణుడిని ఆరాధించే వ్యక్తిగా నెగెటివ్ షేడ్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగుల‌కు ప్ర‌తి ఒక్క‌రి నుంచి ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఈ టీజ‌ర్ మూడు రోజుల్లోనే నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సైతం బ‌ద్ద‌లు కొట్టేసింది.

ఇక ఇటీవ‌ల మ‌న తెలుగు సినిమాలు రిలీజ్‌కు ముందే కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకుంటున్నాయి. ఇప్పుడు జై ల‌వ‌కుశ కూడా ఓ కాంట్ర‌వ‌ర్సీలో ప‌డింది. జై టీజర్‌లో జై పాత్రకు నత్తి, నెగెటివ్ షేడ్ ఉంటుంది. అయితే.. ఈ నెగెటివ్ రోల్‌ను ఇదివరకే తారక్‌కు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెప్పారట. జ‌న‌తా గ్యారేజ్ సినిమా త‌ర్వాత ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు జై క్యారెక్ట‌ర్‌ను పోలి ఉండే పాత్ర‌నే ఎన్టీఆర్‌కు చెప్పాడ‌ట‌.

ఎన్టీఆర్ ఆ క‌థ‌లో కొన్ని మార్పులు చేయాల‌ని చెప్పినా పూరి ఒప్పుకోక‌పోవ‌డంతో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇప్పుడు అదే క్యారెక్ట‌ర్‌ను జై ల‌వ‌కుశ‌లో కాపీ కొట్టేశార‌ని పూరి పైసా వ‌సూల్ సెట్లో బాల‌య్య‌కు చెప్పాడ‌ట‌. ఈ వివాదం ఆ నోటా ఈ నోటా బ‌య‌ట‌కు రావ‌డంతో ద‌ర్శ‌కుడు బాబి స్పందించాడు.

జై లవకుశలోని మూడు పాత్రల్లో నత్తి, నెగెటివ్ షేడ్ ఉన్న జై పాత్రను తన ఒరిజినల్ స్క్రిప్ట్‌ ప్రకారమే చూపించానని… దీని గురించి తాను వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని…. సినిమా రిలీజ్ అయ్యాకే సినిమా మాట్లాడుతుంద‌ని కాస్త గ‌ట్టిగానే పూరి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఆన్స‌ర్ ఇచ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

 

కాంట్ర‌వ‌ర్సీలో ” జై ల‌వ‌కుశ‌ “
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts