పూరీ ఫ్యూచ‌ర్ ఇంక క్లోజేనా ? బ‌్యాంకాక్ వెళ్లేది డ్ర‌గ్స్ కోస‌మేనా?

డ్ర‌గ్స్ భూతం టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఫ్యూచ‌ర్‌ని బ‌లి చేసిందా? ఇంక పూరీ ప‌రిస్థితి ఖ‌త‌మేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిపై కొర‌డా ఝ‌ళిపించిన హైద‌రాబాద్ పోలీసులు ఇందులో ప్ర‌మేయం ఉన్న పెద్ద త‌ల‌కాయ‌ల‌ను టార్గెట్ చేసుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం హాట్ హాట్ గానే న‌డిచినా.. ఇంత సీరియ‌స్‌గా విచార‌ణ జ‌ర‌గ‌డం, ముందే షెడ్యూల్ విడుద‌ల చేయ‌డం, టాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్ల‌ను బ‌హిరంగ ప‌ర‌చ‌డం వంటి చూస్తే.. దీని వెనుక చాలా పెద్ద నిర్ణ‌య‌మే క‌నిపిస్తోంది .

అంతేకాదు, ఈ ద‌ఫా సిట్ అధికారులు పూర్తి ఆధారాలు, సాక్ష్యాల‌తో రెడీ అయిపోవ‌డం విష‌యంలోని సీరియ‌స్‌ను ప‌ట్టి చూపిస్తోంది. ఇక‌, తొలి విచార‌ణ‌గా సిట్ అధికారులు టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరీని విచార‌ణ‌కు పిలిచారు. ఎక్సైజ్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ప‌క‌డ్బందీ రూంలో సీసీ కెమెరాలు, వైద్యుల మ‌ధ్య అధికారులు విచార‌ణ‌ను ప్రారంభించారు. తొలిరోజు విచార‌ణ‌కు పూరీ జగన్నాథ్, తన కుమారుడు ఆకాశ్, సోదరుడు సాయిరాం, ఓ లాయర్ తో కలిసి ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పూరీ బెదరకుండా సమాధానం ఇచ్చారు.

కెల్విన్‌ను ఎప్పుడు, ఎలా కలిశావంటూ అడిగిన ప్రశ్నకు తాను ఓ పార్టీ సందర్భంగా కలిశాను కానీ, అతడితో నాకు రెగ్యులర్‌గా ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారట. అసలు తనకు డ్రగ్స్ అలవాటే లేదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే పూరీ పక్కా ప్లానింగ్‌తో విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక‌, తొలిరోజు విచార‌ణ‌కు సంబంధించి పూరిని అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశార‌ట‌. కొంద‌రు హీరోల‌కు డ్ర‌గ్స్ ఇచ్చింది నిజ‌మా ? కాదా? అని కూడా ప్ర‌శ్నించార‌ని స‌మాచారం. దీనికి సంబందించి ఓ ఫొటోను అధికారులు చూపించ‌డంతో పూరీకి నోట్లో మాట రాలేద‌ని తెలిసింది. ఇక అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం అధికారులు సంధించిన ప్ర‌శ్న‌లు ఇలా ఉన్నాయి..

  1. డ్రగ్స్ ఎన్నిరోజులుగా వాడుతున్నారు?
  2. ఎవరి ద్వారా కెల్విన్ పరిచయం?
  3. కొకైన్ వాడుతున్నది నిజమా? కాదా?
  4. రోజుకు ఎంత మోతాదులో డ్రగ్స్ తీసుకుంటారు? డ్రగ్స్ కోసం నెలవారీగా ఎంత ఖర్చు చేసేవారు?
  5. కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ సరఫరా చేసిందెవరు?
  6. నైజీరియన్ జిఫాన్‌తో ఉన్న లింకేంటి? తరచుగా బ్యాంకాక్ వెళ్తుంటారు డ్రగ్స్ కోసమేనా?
  7. మీరు డ్రగ్స్‌ను అమ్ముతున్నారా? ఫ్రెండ్లీగా పంచుతున్నారా? ఎవరెవరికి వెళ్తున్నాయి?
  8. ముమైత్, ఛార్మి, సుబ్బరాజులకు మీ నుంచే డ్రగ్స్ వెళ్తున్న మాట నిజమా? కాదా?
  9. రవితేజ, భరత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్టు ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏంటి?
  10. డ్రగ్స్‌ తీసుకున్నాక కొద్దిరోజులు ఎందుకు హైదరాబాద్‌లో ఉండరు?
  11. బ్లడ్‌టెస్ట్‌కు సిద్ధమా?

12.మా దగ్గర ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏమిటి?

మ‌రి వీట‌న్నింటినీ చూస్తే.. పూరి ఇక పూర్తిగా ఇరుక్కుపోయిన‌ట్టేనా? అని అనిపించ‌క మాన‌దు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మ‌న పోలీసులు ముంబై పోలీసులంత క‌ఠినంగా ఉంటారో? లేక తూతూ మంత్రంగా వ్య‌వ‌హ‌రించి విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తారో చూడాలి.