టాలీవుడ్లో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న సినిమాల్లో అత్యంత ఆసక్తి రేపుతోన్న సినిమాల్లో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ రంగస్థలం 1985 ప్రి రిలీజ్ బిజినెస్ ఒకటి. రాంచరణ్ – సమంత జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలోను, ట్రేడ్ వర్గాల్లోను ఆసక్తి రేపుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే 51 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. శాటిలైట్ హక్కుల రూపంలో 16 కోట్లు, డిజిటల్ హక్కుల రూపంలో 13 కోట్లు నిర్మాతల చేతికి అందనున్నాయని తెలుస్తోంది.
ఇక ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ. 80 కోట్లకు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు జరిగినట్టు తెలుస్తోంది. ఈ బిజినెస్ రాంచరణ్ కెరీర్లోనే తిరుగులేని రికార్డుగా నిలిచింది. వీటికి తోడుగా కర్ణాటక, ఓవర్సీస్ బిజినెస్ కూడా యాడ్ కానుంది. ఏదేమైనా చెర్రీ స్టార్ ఇమేజే కాకుండా సుకుమార్ మార్కెట్ కూడా తోడవ్వడంతో రంగస్థలం 1985 ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది.