శమంతకమణి TJ రివ్యూ

సినిమా : శమంతకమణి రివ్యూ
రేటింగ్ : 3/5
పంచ్ లై :శమంతకమణి కుర్రాళ్లకు బాగా ఉపయోగపడింది
నటీ నటులు: రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది
నిర్మాత: V ఆనంద ప్రసాద్
బ్యానర్ : భవ్య క్రియేషన్స్
సంగీతం : మణిశర్మ
కథ ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీరాం ఆదిత్య

భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన శ్రీరాం ఆదిత్య ఆ సినిమాతో డైరెక్టర్ గా తన తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పడు తన రెండోచిత్రంగా శమంతకమణి సినిమాతో వచ్చాడు.
శమంతక మణి అనే అయిదు కోట్ల రూపాయల విలువయిన కారు ఒక పెద్ద హోటల్ లో దొంగతనికి గురవడంతో సినిమా ప్రారంభమవుతుంది. అయితే అదేరోజు ఆ హోటల్ లో జరిగిన పార్టీ కి వచ్చినవాళ్లలో ఎవరో దొంగిలించి ఉంటారని ఊహించి ఆ పార్టీకి వచ్చినవాళ్ళను గుర్తించి అసలు దొంగలను పట్టుకోవటం అనేది కథ. కథాపరంగా చుస్తే ఇది చాలా చిన్న సస్పెన్సు స్టోరీ. అయితే దానిని నడిపించిన విధానంతో డైరెక్టర్ ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోపెట్టేసాడు. నటన పరంగా గుర్తింపుతెచ్చుకున్నా, హీరోలుగా మంచి అవకాశాలు లేక అవకాశాలకోసం ఎదురు చూస్తున్న ఈ కుర్రహీరోలని ఎంపికచేసుకోవటంలోనే దర్శకుడు సగం విజయాన్ని అదేసుకున్నాడు. ఎందుకంటే అంతబాగా మెప్పించారు ఆ నలుగురు కుర్ర హీరోలు.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా శమంతకమణి ఎలాదొంగిలించబడిందనే దానితో ముడిపెట్టి అన్ని క్యారెక్టర్స్ ని పరిచయం చేయటం తోనే సరిపోతుంది. అయితే సినిమాని ఎక్కడా బొర్ కొట్టించకుండా నడిపించిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా సస్పెన్స్ రివీల్ కాకుండా సినిమా క్లైమాక్స్ వరకు తీసుకెళ్లటం లో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇలాంటి సినిమాలలో ప్రేక్షకుడు సస్పెన్స్ ఏమాత్రం ఊహించగలిగినా సినిమా బోర్ కొట్టేస్తుంది. కానీ ఈ సినిమాలోని సస్పెన్స్, క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్ గా ఉండి ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాలకు కావలసినదే సస్పెన్స్. దానిని మెయింటైన్ చేయటం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

నారా రోహిత్ ఎంచుకునే పాత్రలను చూస్తుంటే అతనిని తప్పకుండా మెచ్చుకోవలసిందే. ఎందుకంటే హీరోగా సినిమాలు సక్సెస్ అందుకున్నప్పటికీ. హీరో రోల్స్ కోసం మాత్రమే ఎదురు చూడకుండా ప్రాధాన్యత వున్న పాత్రలను సైతం చేయటానికి ఒప్పుకుంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్ గా తన క్యారెక్టర్ ని చాలా ఈజ్ తో చేసాడు. సినిమాకి ప్రేక్షకులను కనెక్ట్ చేసే పాత్ర ఇది దానికి అవసరమయిన నటనను అందించి సినిమాని సేఫ్ జోన్ లోకి లాగేసాడు నారా రోహిత్.

ఒక కోటీశ్వరుడి కొడుకు పాత్రలో సుధీర్ బాబు మెప్పించాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో సుధీర్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సందీప్ కిషన్ మాస్ టచ్ తోవున్న పల్లెటూరి కుర్రోడిగా బాగా ఎంటర్టైన్మెంట్ చేసాడు. ఆది కూడా తనకు వచ్చిన అవకాశాన్ని చాలాబాగా వినియోగించుకున్నాడు. ఇక సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తన క్యారెక్టర్ తో ఈ సినిమాకి పెద్ద అసెట్ అయ్యారు.
ఫైనల్ గా శమంతకమణి సినిమా మంచి సస్పెన్సు ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించగల సినిమా అవుతుంది.