ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాలో అభ‌య్‌రామ్ రోల్ ఇదే

October 24, 2017 at 7:49 am

టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీ హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీలో నాటి ఎన్టీఆర్ నుంచి ఆ త‌ర్వాత ఆయ‌న వారసుడు బాల‌కృష్ణ‌, ఇప్పుడు మ‌న‌వళ్లు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఇక ఇప్పుడు బాల‌య్య త‌న‌యుడు మొక్ష‌జ్ఞ కూడా వెండితెరంగ్రేటం చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

మోక్ష‌జ్ఞ‌తో పాటు దివంగ‌త జాన‌కీరామ్ త‌న‌యులు కూడా గ‌తేడాది వ‌చ్చిన ఓ సినిమాతో బాల న‌టులుగానే మెప్పించారు. ఇప్పుడు వీరితో పాటు టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న‌యుడు మూడేళ్ల అభ‌య్‌రామ్ కూడా వెండితెర‌పై త‌ళుక్కుమ‌న‌నున్న‌ట్టు తెలుస్తోంది. వ‌రుస హిట్ల‌తో జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో త‌న నెక్ట్స్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి ప‌వ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వ్వ‌డం సినిమా, రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద సెన్షేష‌న్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ కూడా వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి భార్య ప్రణతి, కుమారుడు అభయ్‌రామ్ సహా అటెండ్ అయ్యారు. కార్యక్రమంలో అభయ్ రామ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ త‌న‌యుడు అభ‌య్‌రామ్ ఓ స్మాల్ గెస్ట్ రోల్‌లో త‌ళుక్కుమంటాడ‌ట‌. ఇటీవ‌ల హీరోల త‌న‌యులు వెండితెర‌పై త‌ళుక్కుమంటున్నారు. మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్ వ‌న్ సినిమాలో మ‌హేష్ చిన్న‌ప్ప‌టి రోల్‌లో ఇర‌గ‌దీశాడు. ఇక తాజాగా ర‌వితేజ రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ తనయుడు మనిత్ నటించిన విషయం విదితమే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ త‌న‌యుడు అభ‌య్‌రామ్ కూడా చాలా చిన్న వ‌య‌స్సులోనే వెండితెర‌పై మెర‌వ‌నున్నాడు. ఈ సినిమాలో అభ‌య్‌రామ్ ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి రోల్‌లో క‌నిపిస్తాడ‌ట‌. దీనిపై చిత్ర‌యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

 

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాలో అభ‌య్‌రామ్ రోల్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts