అదిరింది TJ రివ్యూ

టైటిల్‌: అదిరింది

జాన‌ర్‌: ఎమోష‌న‌ల్ మెసేజ్ యాక్ష‌న్ డ్రామా

బ్యాన‌ర్‌: తెన్నాండాల్ స్టూడియోస్ లిమిటెడ్‌, నార్త్‌స్టార్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్‌

న‌టీన‌టులు: విజ‌య్‌, స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్‌, వ‌డివేలు, కోవై స‌ర‌ళ‌, ఎస్‌జెసూర్య‌, స‌త్య‌రాజ్‌, రాజేంద్ర‌న్ త‌దిత‌రులు

మ్యూజిక్‌: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

సినిమాటోగ్ర‌ఫీ: జి.కె.విష్ణు

నిర్మాత‌లు: ఎన్‌.రామ‌స్వామి, హేమ‌రుక్మిణి

ద‌ర్శ‌క‌త్వం: అట్లీ

రిలీజ్‌డేట్‌: 9 న‌వంబ‌ర్‌, 2017

కోలీవుడ్ హీరోలు తెలుగులో మార్కెట్ కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక్క‌డ ఇప్పటికే క‌మ‌ల్‌, ర‌జ‌నీ, సూర్య‌, కార్తీ, విశాల్ వీళ్లంద‌రూ మంచి మార్కెట్ ఏర్ప‌రుచుకున్నా అక్క‌డ స్టార్ హీరో విజ‌య్‌కు ఇప్ప‌ట‌కీ కూడా ఇక్క‌డ స‌రైన మార్కెట్ లేదు. ఇక్క‌డ మార్కెట్ కోసం విజ‌య్ ఇక్క‌డ దండ‌యాత్ర‌ల మీద దండ‌యాత్ర‌లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా విజ‌య్ న‌టించిన చిత్రం మెర్స‌ల్‌. కోలీవుడ్ రిలీజ్‌కు ముందు రిలీజ్‌కు త‌ర్వాత కావాల్సిన‌న్ని వివాదాల‌ను మూట‌క‌ట్టుకున్న ఈ సినిమా తెలుగులో త‌మిళ్‌తో పాటు రిలీజ్ కావాల్సి ఉన్నా ప‌లుసార్లు వాయిదాలు ప‌డి ఎట్ట‌కేల‌కు ఈ రోజు అదిరిందిగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌న తెలుగు స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చిన ఈ సినిమాలో విజ‌య్ ట్రిబుల్ రోల్ పోషించ‌గా, కాజ‌ల్‌, సమంత‌, నిత్యామీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. తెలుగులో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

ఈ సినిమా ముందే త‌మిళ్‌లో రిలీజ్ అవ్వ‌డంతో చాలా మందికి స్టోరీ ముందే తెలిసిపోయింది. డాక్టర్‌ భార్గవ్‌ (విజయ్‌) కేవలం 5 రూపాయల ఫీజు తీసుకొని వైద్యం చేస్తుంటాడు. పేద‌ల‌కు వైద్యం చేసేందుకు అత‌డు చేస్తోన్న కృషిని భార్గ‌వ్‌కు అంతర్జాతీయ హ్యుమానిటేరియన్‌ అవార్డ్‌ దక్కుతుంది. భార్గ‌వ్ ఈ అవార్డు తీసుకునేందుకు విదేశాల‌కు వెళ‌తాడు. అక్క‌డ తెలుగు డాక్ట‌ర్ అయిన అర్జున్ (హ‌రీష్ పేర‌డీ) చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకుంటాడు. ఇక అర్జున్ ద‌గ్గ‌ర ప‌నిచేసే అనుప‌ల్ల‌వి (కాజ‌ల్‌)కు మెజీషియ‌న్‌గా ప‌రిచ‌యం అయిన భార్గ‌వ్ ఓ ప్రోగ్రామ్‌కు అర్జున్‌ను కూడా తీసుకుర‌మ్మ‌ని ఆమెకు చెపుతాడు. అయితే అనూహ్యంగా అదే షోలో అందరి ముందే డాక్టర్‌ అర్జున్‌ని పొడిచి చంపేస్తాడు భార్గవ్‌. ఆ త‌ర్వాత ఇండియాలో అనేక‌మంది వైద్యులు కిడ్నాప్‌కు గుర‌వుతుంటారు. ఈ కేసు డీల్‌ చేయడానికి వచ్చిన డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వర్‌, భార్గవ్‌ ను అరెస్ట్‌ చేస్తాడు. కమిషనర్‌ అరెస్ట్‌ చేసింది భార్గవ్‌ నేనా..? చనిపోయిన అర్జున్‌కి భార్గవ్‌కు ఉన్న లింకేంటి ? ఈ కథతో యూనివర్సల్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డానియోల్‌ ఆరోగ్యరాజ్‌కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ :

విజ‌య్ ట్రిబుల్ రోల్‌లో చ‌క్క‌గా న‌టించాడు. ఓ మంచి ప‌ని కోసం తండ్రి చేసే ప‌ని ఆగిపోయిన‌ప్పుడు అత‌ని ఇద్ద‌రి కొడుకులు ఏం చేస్తారనేదే ప్ర‌ధాన క‌థాంశం. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే స‌మంత‌, కాజ‌ల్, నిత్యా పాత్ర‌ల్లో నిత్యాపాత్ర‌ల్లో నిత్యా పాత్ర‌కు మాత్ర‌మే మంచి స్కోప్ ఉంది. ఎమోష‌న్స్ బాగా పండించింది. స్పైడ‌ర్‌లో క్రూర‌మైన విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన డైరెక్ట‌ర్ ఎస్‌జె.సూర్య స్టైలిష్ విల‌న్‌గా చ‌క్క‌గా మెప్పించాడు. త‌న వ్యాపార సామ్రాజ్య విస్త‌ర‌ణ కోసం ఎంత‌కైనా తెగించే విల‌న్‌గా చ‌క్క‌గా ఒదిగిపోయాడు. సాంకేతికంగా విష్ణు సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్‌. అత‌డు ఎంచుకున్న లొకేష‌న్లు బాగున్నాయి. పాట‌లు నెటివిటీ ప‌రంగా మైన‌స్‌గా ఉన్నా రెహ్మ‌న్ ఆర్ ఆర్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సి ఉంది. తేనాండ‌ల్ సంస్థ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. రొటీన్ రొట్ట స్టోరీయే అయినా స్క్రీన్ ప్లే ఈ సినిమాను నిల‌బెట్టింది. అలా పూర్తిగా తీసిప‌డేయ‌ద‌గ్గ సినిమానూ కాదు. తెలుగులో గ‌తంలో వ‌చ్చిన ఒక అపరిచుతుడు, ఒక బాహుబలి, ఒక లింగా, ఒక ఠాగూర్ ఇలా కనిపించిన ప్రతి సినిమాలో సన్నివేశం ఈ సినిమాలో ఉంటుంది. రాజా రాణి, తెరి లాంటి సినిమాలు తీసిన అట్లీ ఈ స్టోరీ ఎందుకు ఎంచుకున్నాడా ? అని కాస్త ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌మాన‌దు. ఓవ‌రాల్‌గా మాత్రం మెసేజ్‌తో ఉన్న క‌మ‌ర్షియ‌ల్ మార్క్ మూవీగా అదిరింది నిలుస్తుంది.

ప్లస్ పాయింట్స్ (+) :

– విజయ్‌ నటన

– ఎస్‌జె.సూర్య విల‌న్ రోల్‌

– సామాజిక నేప‌థ్యం

– సెకండాఫ్‌

– ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ముందు సీన్లు

– స్క్రీన్ ప్లే

– రెహ్మ‌న్ ఆర్ ఆర్‌

మైనస్ పాయింట్స్ (-) :

– సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌

– పాటలు

– నేటివిటీ మిస్‌

– పాత స్టోరీ

TJ ఫైన‌ల్ పంచ్‌: రొటీన్ స్టోరీకి మెసేజ్‌తో క‌మ‌ర్షియ‌ల్ కోటింగ్‌

TJ సూచ‌న‌: ఈ వీకెండ్‌లో టైం ఉంటే మేసేజ్ కోసం ఓ సారి చూడొచ్చు

TJ అదిరింది మూవీ రేటింగ్ : 2.5 / 5